హిట్లర్ కేసీఆర్ కాస్తా భగీరధుడయ్యారా...నోటుకి నీళ్ళా ... జగన్ పై లోకేష్ ఫైర్

Recommended Video

    జగన్ పై మరోసారి విరుచుకుపడ్డ నారా లోకేష్ | Nara Lokesh Tweet On Jagan About The Water Delas With KCR

    ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ , టీఆర్ఎస్ ల రహస్య స్నేహంపై పెద్ద ఎత్తున ప్రచారం చేసింది టీడీపీ . ఇక జగన్ గెలుపుకు తెలంగాణా సీఎం కేసీఆర్ తోడ్పాటు అందిస్తున్నారని టీడీపీ అప్పుడు జోరుగానే ప్రచారం చేసింది. ఇక రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కు తాకట్టు పెట్టె అవకాశం ఉందని ఎన్నికలకు ముందే ఆరోపణలు గుప్పించింది. అయినా ఏపీ ప్రజలు జగన్ ను ఆదరించారు. ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. ఇక కేసీఆర్ , జగన్ లు జలవివాదాల పరిష్కారం దిశగా చర్చలు జరుపుతూ చేస్తున్న పనులపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ ఇప్పుడు కూడా వారిద్దరి టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తుంది. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అయితే సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

    జగన్ నాడు జలదీక్ష చేసిన సమయంలో గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని అది ఆపకపోతే భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని జగన్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఒకప్పుడు జగన్ గారి జలదీక్షలో ఆంధ్రా నీళ్లు దోచేసిన కేసీఆర్ కాస్తా జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి ఆంధ్రాకి నీళ్లు దానం చేసే మనసున్న మారాజుగా మారిపోయారంటూ ఎద్దేవా చేసారు. కేసీఆర్ తో జగన్ నీటి ఒప్పందాల వెనుక నోట్ల వ్యవహారం ఉందని ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

    Nara lokesh tweet on jagan.. about the water delas with kcr

    అక్రమ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని కేంద్రం జోక్యం చేసుకుని ఆపాలని లేని పక్షంలో భారత్, పాకిస్థాన్ లు ఎలా అయితే యుద్ధాలు చేసుకుంటున్నాయో అలాగే భవిష్యత్ లో నీటి కోసం తెలుగు రాష్ట్రాలు యుద్ధాలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుందని జగన్ అన్న విషయాలు గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు నారా లోకేష్ . వాటిని గుర్తు చేస్తూ పోస్ట్ పెట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హిట్లర్ అంటూ ఆనాడు జగన్ అభివర్ణించారని నేడు ఆయన అపర భగీరధుడిగా మారిపోయారా .. మంచి వ్యక్తి అయిపోయాడా అంటూ నారా లోకేష్ విమర్శించారు. అంతేకాదు యూ టర్న్ జగన్ గారూ ఈ ఊసరవెల్లి వేషాలు మాని, ఎన్నికల్లో గెలుపు కోసం కేసీఆర్ నుంచి కట్టల సాయం అందుకున్నాం, అందుకే రిటర్న్ గిఫ్ట్ గా గోదావరి నీటిపై ఆంధ్రా హక్కులు వదులుకుంటున్నాం అని చెప్పండంటూ తీవ్ర విమర్శలు చేసారు. అంతే కాదు నోటుకి నీళ్ళు అంటూ ట్విట్టర్ లో పెద్ద పోస్ట్ పెట్టారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+