నారా రోహిత్ జోస్యం .. జగన్ వైసీపీని బీజేపీలో కలిపేస్తారట
Recommended Video

కొన్ని గంటలే ప్రచారానికి సమయం ఉన్న నేపధ్యంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. ఈసారి విజయం సాధించటం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న టీడీపీ జాతీయ నేతలతో, స్టార్ క్యాంపెయినర్లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తుంది . ఇక స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగిన నారావారి హీరో నారా రోహిత్ చివరి రోజు ప్రచారంలో దూకుడు చూపిస్తున్నారు . వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని చెప్పుకొచ్చారు.

మూడు దుష్ట శక్తులు కలిశాయి . అయినా టీడీపీదే విజయం
ఏపీని అభివృద్ధిలో ముందుంచే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని స్టార్ క్యాంపెయినర్ సినీ హీరో నారా రోహిత్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువారిపల్లె, ఎన్టీఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండు వద్ద వచ్చిన ప్రజలను ఉద్ధేశించి మాట్లాడిన రోహిత్.. బీజేపీ , వైసీపీ , టీఆర్ఎస్ పార్టీలను దుష్ట శక్తులుగా అభివర్ణించారు. చంద్రబాబు విజయం అడ్డుకోవాలని చూస్తున్న మూడు దుష్టశక్తులు ఏకమయ్యాయని, అయినా వారు ఏమీ చెయ్యలేరని రోహిత్ పేర్కొన్నారు . రాష్ట్రం విడిపోయాక ఒకవైపు రాజధాని నిర్మాణం చేస్తూ మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిన చంద్రబాబు ప్రజల మన్ననలు పొందారని అన్నారు నారా రోహిత్ .
జగన్ కేసుల మాఫీ కోసం బీజేపీలో వైసీపీ కలిసిపోతుందన్న నారా రోహిత్
ఇక సాయంత్రంతో ప్రచారం ముగియనున్న నేపధ్యంలో ఆయన చివరి రోజు కోడా సంచలన వ్యాఖ్యలే చేశారు . ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ నేరుగా బీజేపీతో కలిసిపోతుందని నారా రోహిత్ జోస్యం చెప్పారు. తనపై ఉన్న 32కేసులు మాఫీ చేసుకునేందుకు బీజేపీతో దోస్తీ చేసుకుంటున్నారని రోహిత్ ఆరోపించారు. మొత్తానికి అటు నారా వారి కుటుంబం కూడా ఈ సారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంది. మరి ప్రజల తీర్పు మరి కొన్ని గంటల్లో ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది.
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications