‘విమానంలో చక్కర్లు ఆపి.. హోదాపై ఒత్తిడి తెండి’

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సిపిఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం నెల్లూరులో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి సరిగా లేదని అన్నారు.

ప్రత్యేక విమానాల్లో చెక్కర్లు కొట్టడం మాని.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేలా ఢిల్లీలో ఒత్తిడి తీసుకురావాలని చంద్రబాబుకు నారాయణ హితవు పలికారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగు ప్రజల ద్రోహిగా మిగిలిపోయారని ఆరోపించారు.

హోదాపై పిల్లిమొగ్గలెందుకు?: కేంద్రంపై మైసూరా ఫైర్

Narayana fires at Chandrababu for special status

హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తూ కుంటి సాకులు చెప్పడం ఎంతమాత్రం సరికాదని, అసలు ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెనుకా ముందూ చూడకుండా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 'ప్రత్యేక హోదా ఇవ్వగానే రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయా?' అని మంత్రి అనడం శోచనీయమన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందనీ.. ప్రత్యేక హోదాతోనైనా పారిశ్రామికాభివృద్ధి జరిగి ఆర్థిక పుష్టి కలుగుతుందని.. అందువల ఆ షరతును విధించే తాము రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు నిస్తున్నామని నాడు బిజెపి జాతీయనేతలంతా చెప్పారని మైసూరా గుర్తుచేశారు.

బీహార్, బెంగాల్ ఎన్నికలున్నాయి కనుక ప్రత్యేక హోదా ఇచ్చే విషయం కుదరడం లేదని, తమిళనాడు వ్యతిరేకిస్తుందనే మాటలు ఆనాడు రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేటపుడు బిజెపికి గుర్తుకురాలేదా? అని మైసూరా ప్రశ్నించారు. ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు ప్రత్యేక హోదా కోరుతోందా? లేక ప్రత్యేక ప్యాకేజీ చాలనుకుంటోందా? చెప్పాలని మైసూరా డిమాండ్ చేశారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+