పర్యాటకుల కోసం ప్రత్యేక భద్రతా దళం: బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోపర్యాటకుల భద్రత కోసం ప్రత్యేక పోలీసు దళం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం పర్యాటక శాఖపై ఏపి సిఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

పర్యాటకుల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు, వారి సౌకర్యార్థం కాల్‌సెంటర్ ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమల తరహాలో పర్యాటక ప్రాజెక్టులకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వాలని చంద్రబాబు అధికారులకు తెలిపారు.
బేటీ బచావో-బేటీ పడావో విజయవంతం చేస్తాం
బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతం చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకోసం గురుకుల పాఠశాలల్లో శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కర్నూలులో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసే యోచన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేఈ కృష్ణమూర్తి, తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications