సీఆర్డీఏ వల్లే 'రాజధాని' సమస్య: మంత్రి, ఎన్టీఆర్‌ను మించారు: బాబు-కెసిఆర్‌పై బొత్స
గుంటూరు: సిఆర్డీఏ అధికారుల నిర్లక్ష్యం వల్లే రాజధాని అమరావతి గ్రామాలలో సమస్యలు వస్తున్నాయని, బుధవారం లోపు 29 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులు శుక్రవారం నాడు చెప్పారు.
రాజధాని ప్రాంత రైతులతో మంత్రులు, సిఆర్డీఏ అధికారులు శుక్రవారం భేటీ అయ్యారు. తుళ్లూరు మండలంలోని ఐనవోలులో మాస్టర్ ప్లాన్ పైన అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఆర్డీఏ అధికారుల తీరు పైన ఎమ్మెల్యే శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఏ విషయంలోను అధికారులు తనను సంప్రదించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోవడం లేదని శ్రవణ్ అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో... స్థానిక ఎమ్మెల్యేను పట్టించుకోకపోవడం సరికాదని మంత్రులు సిఆర్డీఏ అధికారులకు సూచించారు.

ఎన్టీఆర్‌ను మించి నటిస్తున్నారు: బొత్స
ప్రభుత్వం మున్సిపల్ చట్టాన్ని అపహాస్యం చేస్తోందని వైసిపి నేత బొత్స సత్యనారాయణ శుక్రవారం ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, మచిలీపట్నం మున్సిపాల్టీలను కార్పోరేషన్లుగా అప్ గ్రేడ్ చేసినా ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
మేయర్లుగా చలామణి అవడం రాజ్యాంగ ఉల్లంఘన అని, దీనిపై మున్సిపల్ మంత్రి, సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిడిపి, టిఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్‌ను మించి నటిస్తున్నారని ఎద్దేవా చేశారు.
టిడిపి, టిఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని, ఓటుకు నోటు కేసులో ముద్దాయి చంద్రబాబు హైదరాబాదులో తిరుగుతుంటే కెసిఆర్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఏపీ సర్కార్ పోలవరం కాంట్రాక్టర్‌కు రూ.2వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో ఇ్చిందని, అందులో చంద్రబాబు వాటా ఎంతో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications