నారాయణఖేడ్: ఐదు భాషలు, మూడు కుటుంబాలు

1972లో షెట్కార్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కల్హేర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత నేత ఎం.వెంకట్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకిదిగి శివరావ్ షెట్కార్‌పై విజయం సాధించారు. 1978లో శివరావ్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డిపై గెలిచారు. 1983 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వెంకట్‌రెడ్డి మరోమారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివరావ్ షెట్కార్‌పై గెలిచారు. 1985 మద్యంతర ఎన్నికల్లో శివరావ్ షెట్కార్ పోటీ చేసి వెంకట్‌రెడ్డిపై విజయం సాధించారు.
1989ల్లో షెట్కార్ కుటుంబానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో దివంగత నేత ఎం.బాగారెడ్డి బావమరిది అయిన పట్లోళ్ల కిష్టారెడ్డికి కాంగ్రెసు అదిష్టానం టికెట్ కేటాయించగా ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1989 ఎన్నికల వరకు ఖేడ్ నియోజకవర్గంలో రెండు కుటుంబాల మద్య పరస్పర పోరు నెలకొనగా కిష్టారెడ్డి అరంగ్రేటం చేయడంతో కాంగ్రెస్‌లో రెండు గ్రూపులు ఏర్పడ్డాయి.
1994 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి తొలిసారిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని నమోదు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి పెద్ద కుమారుడు విజయపాల్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై ఘనవిజయం సాధించారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న గ్రూపులు సద్దుమనిగి ఒకటికావడంతో 1999 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మరోమారు పోటీ చేసిన కిష్టారెడ్డికి విజయం వరించింది. 2004 ఎన్నికల్లో సురేష్‌కుమార్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయపాల్‌రెడ్డిపై గెలుపొందారు.
2009 ఎన్నికలకు వచ్చేసరికి విజయపాల్‌రెడ్డి కుటుంబంలో ఏర్పడిన అంతర్గత కలహాల వల్ల విజయపాల్ సోదరుడు భూపాల్‌రెడ్డి తెరాస అభ్యర్థిగా పోటీ చేయగా విజయపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం, తెరాస, సిపిఎం, సిపిఐ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన భూపాల్‌రెడ్డి మూడవ స్థానంలో ఉండగా ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన విజయపాల్‌రెడ్డి రెండవ స్థానంలో నిలిచారు.
ప్రస్తుత ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిష్టారెడ్డి బరిలోకి దిగగా టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఎం.విజయపాల్‌రెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థిగా భూపాల్‌రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అప్పారావు షెట్కార్ పోటీ చేస్తున్నారు. నాలుగు కుటుంబాలకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తున్నారు. పోటీలో పది మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్ అభ్యర్థుల మద్దనే పోటీ రసవత్తరంగా కొనసాగుతుంది.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications