ఏపీలో బీజేపీకి ఎంపీ సీట్లు కష్టమేనా ? జాతీయ సర్వేలు ఏం చెప్తున్నాయ్..?

ఏపీలో త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలకు అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు విపక్షాలు పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్డీయే కూటమిగా టీడీపీ, జనసేన పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమిలో 6 ఎంపీ సీట్లకు పోటీ చేస్తున్న బీజేపీకి ఈసారి ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఎన్డీయేలో కూటమిలో భాగంగా బీజేపీ ఆరు సీట్లు తీసుకుంది. టీడీపీ 17 సీట్లకు పోటీ చేస్తుండగా.. జనసేన రెండు సీట్లకు పరిమితమైంది. అయితే ఇందులో టీడీపీ 13 ఎంపీ సీట్లకు నిన్న అభ్యర్ధుల్ని ప్రకటించింది. మరో నాలుగు స్ధానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. జనసేన మచిలీపట్నం, కాకినాడ సీట్లలో పోటీ చేయబోతోంది. బీజేపీ ఇంకా తమ ఆరు స్ధానాలకు అభ్యర్ధుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇంకా మిగిలి ఉన్న సీట్లలో అరకు, విజయనగరం, అనకాపల్లి, కడప, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి, అనంతపురం ఉన్నాయి. ఇందులో ఆరు సీట్లు బీజేపీ తీసుకోవాల్సి ఉంది.

national surveys predict bjp tough to win 2-3 mp seats in ap despite nda alliance

ఇలా ఆరు సీట్లు తీసుకోబోతున్న బీజేపీ.. వీటిలో మెజార్టీ సీట్లు గెల్చుకుని ప్రధాని మోడీ 400 సీట్ల కల నెర వేర్చాల్సి ఉంది. కానీ క్షేత్రస్ధాయిలో పరిస్దితుల్ని గమనిస్తే అది సాధ్యం కాకపోవచ్చని జాతీయ సర్వేలు చెప్తున్నాయి. ఇప్పటివరకూ వెలువడిన ఏ సర్వేలోనూ బీజేపీ ఏపీలో ఆరు సీట్లు గెల్చుకుంటుందన చెప్పలేదు. అదే సమయంలో ఎన్డీయే కూటమికి అత్యధిక ఎంపీ సీట్లు వస్తాయని మాత్రమే చెబుతున్నాయి. దీంతో టీడీపీ, జనసేన గరిష్టంగా లబ్ది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్రంలో నామమాత్రపు ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ అభ్యర్ధుల్ని ఆరు ఎంపీ సీట్లలో అంటే దాదాపు 42 అసెంబ్లీ సీట్లలో టీడీపీ, జనసేన తమ ఓటు బదిలీ చేయించి గెలిపించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇదే బీజేపీ సీట్లకు గండి కొట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+