విజయసాయిరెడ్డి కామెంట్స్ తో కూటమి అలర్ట్-ముందస్తు వార్నింగ్స్..!
ఏపీలో వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకోవడం, ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేయడం, దాన్ని వెంటనే రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా తన రాజీనామా వైసీపీకి నష్టం చేస్తుందని, కూటమికి మేలు చేస్తుందంటూ సాయిరెడ్డి చేసిన కామెంట్స్ తో అధికార కూటమి అలర్ట్ అయింది.
సాయిరెడ్డి కామెంట్స్ పై కూటమి నేతలు వెంటనే స్పందించారు. భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తో పాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర నేతలు కూడా స్పందిస్తున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసినా విజయసాయిరెడ్డి చట్టం నుంచి తప్పించుకోలేరని గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. సాయిరెడ్డి వల్ల పడిన ఇబ్బందుల్ని ఇంకా విశాఖ ప్రజలు మర్చిపోలేదన్నారు. వైసీపీ మునిగిపోయే నావ అని ఎప్పుడో చెప్పామని, అది ఇప్పుడు నిజం అవుతూందన్నారు.

మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఇవాళ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగడంపై స్పందించారు. రాజకీయాల నుంచి సన్యాసం తీసుకున్నా తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే అన్నారు. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలి పెట్టేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఆయనకు గొడ్డలి కలలోకి వచ్చిందేమో అంటూ చమత్కరించారు. ఇక బెజవాడ టీడీపీ నేత బుద్ధా వెంకన్న సైతం తన ప్రత్యర్ధి సాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
జగన్ రెడ్డి, @VSReddy_MP కలిసి ఆడుతున్న డ్రామా ఇది..! @ysjagan కి తెలిసే అంతా జరుగుతుంది.. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా..!
— Budda Venkanna (@BuddaVenkanna) January 25, 2025
చంద్రబాబు గారితో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు.. విజయసాయి రెడ్డి చంద్రబాబు గారిని అన్న ప్రతి…
ఈ నిర్ణయం జగన్, సాయిరెడ్డి కలిసి ఆడుతున్న డ్రామా అన్నారు. జగన్ కి తెలిసే ఇదంతా జరుగుతుందన్నారు. వీళ్లిద్దరి కేసులు పక్కదారి పట్టించడానికి ఆడతున్న నాటకం ఇదంతా అన్నారు. చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్ళు కాదు ప్రజలు అన్నారు. విజయసాయి రెడ్డి చంద్రబాబును అన్న ప్రతి మాట తమకు ఇంకా గుర్తు ఉందని, చేసినవి అన్నీ చేసి ఈరోజు రాజీనామా చేసి వెళ్ళిపోతా అంటే కుదరదన్నారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలి అన్నారు. సీబీఐ విజయసాయిని దేశం విడిచి వెళ్ళడానికి అనుమతి ఇవ్వకూడదన్నారు..












Click it and Unblock the Notifications