సర్వే: సీమాంధ్రలో జగన్ ఫస్ట్, చంద్రబాబు సెకండ్

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తీవ్రంగా దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తోంది. 16 నెలల పాటు జైలులో ఉండి, అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ హవా సీమాంధ్రలో కొనసాగుతోంది. ఎన్డీటీవి నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.

సీమాంధ్రలో 25 లోకసభ స్థానాలున్నాయి. ప్రస్తుతం కాంగ్రెసుకు 21 మంది పార్లమెంటు సభ్యులున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే కాంగ్రెసు గెలిచే అవకాశాలున్నట్లు ఎన్డీటివి ఓపీనియన్ పోల్‌లో తేలింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15 లోకసభ స్థానాలను గెలుచుకుని తన సత్తాను చాటనుంది. తెలుగుదేశం పార్టీకి 9 సీట్లు రావచ్చు. ప్రస్తుతం ఆ పార్టీకి నలుగురు పార్లమెంటు సభ్యులున్నారు.

NDTV's Opinion Poll: Jagan Mohan Reddy, a very big deal

వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 43 శాతం ఓట్లు, బిజెపి - తెలుగుదేశం కూటమికి 37 శాతం ఓట్లు వస్తాయని తేలింది. కాంగ్రెసుకు 14 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. రాష్ట్ర విభజన ప్రభావం కాంగ్రెసుపై తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

వైయస్ జగన్‌ సమైక్యాంధ్ర నినాదాన్ని తీసుకుని తెలంగాణను పూర్తిగా వదిలేశారు. దీంతో సమైక్యవాదిగా జగన్‌కు ప్రజల నుంచి ఆదరణ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీమాంధ్రలో కాంగ్రెసు నాయకులు పెద్ద యెత్తున తెలుదేశం పార్టీలో చేరారు, చేరుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడుతుందనేది చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+