అమెరికా ఎపి మహిళ మృతి: భర్తపై అనుమానాలు
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతి హత్యా, ఆత్మహత్యా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల నెల్లూరుకు చెందిన సాయిసింధు అనే యువతి అమెరికాలోని కాలిఫోర్నియాలో మరణించింది.

సాయిసింధు మరణించినట్టు ఆమె భర్త ఉదయ్ కుమార్ తెలిపినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఆమెను అదనపు కట్నం కోసం అల్లుడే చంపాడని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ స్థితిలో సాయిసింధు తండ్రి కృష్ణయ్య నెల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా గత 2011లో సాయిసింధుకు ఉదయ్ కుమార్‌తో వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచి తమ కుమార్తెను ఉదయ్ కుమార్ ఉన్మాదిలా ప్రవర్తిస్తూ వేదిస్తున్నాడని, ఆమె మృతికి అతడే కారణమని సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.వివాహం జరిగిన రెండు నెలల నుంచి సాయిసింధును అత్తంటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో ఉదయ్‌కుమార్ కొట్టడం వల్లే అమ్మాయి చనిపోయిందంటూ సాయిసింధు తల్లిదండ్రులు ఆరోపించారు.
ఐదారు రోజుల క్రితం ఈ ఘటన జరిగినప్పటికీ అత్తంటి వారు గోప్యంగా ఉంచారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ ఉదయ్‌కుమార్ కుటుంబసభ్యులు అమ్మాయి తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సాయిసింధూ మృతదేహం స్వదేశానికి రాలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications