నెల్లూరు:శుక్రవారం సామూహిక సెలవుతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన
నెల్లూరుఃజిల్లా కలెక్టర్ పై వైసిపి ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు శుక్రవారం సామూహికంగా సెలవు పెట్టడం ద్వారా నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు.
జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుపై ఎంఎల్ ఎ కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకు నిరసనగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే కలెక్టర్‌కు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

'కలెక్టర్ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కారుకు టిడిపి జెండాను కట్టుకోవాలి. అవసరమైతే కలెక్టర్‌పైనా విచారణ చేయాలి' అని ఎంఎల్ ఎ కాకాని గోవర్థన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications