రేపు సాయంత్రం మోడీతో పవన్ భేటీ, ఆఫీసు ప్రారంభం
న్యూఢిల్లీ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. గత కొద్ది రోజులుగా మోడీతో పవన్ భేటీ అవుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే, రేపు సాయంత్రం మోడీని కలిసేందుకు పవన్‌కు అపాయింటుమెంట్ దొరికినట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు గుజరాత్ రాజధాని అహ్మదాబాదులో మోడీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పొత్తు అంశం కూడా చర్చకు రానుంది.

పవన్ కళ్యాణ్... మోడీతో పాటు ఢిల్లీలో ఇతర బిజెపి నేతలను, ఇతర పార్టీల నేతలను కూడా కలిసే అవకాశముంది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి కామన్ సింబల్ కేటాయింపు కోసం అడగనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీపై ఇంకా స్పష్టత లేదనే చెప్పవచ్చు.
పార్టీ కార్యాలయం ప్రారంభించిన పవన్
పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం హైదరాబాదులో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యాలయం ప్రారంభించిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరారని సమాచారం. అక్కడి నుండి అహ్మదాబాదుకు వెళ్లనున్నారు.
అహ్మదాబాద్‌కు పవన్
పవన్ కళ్యాణ్ మోడీని కలిసేందుకు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బయల్దేరి వెళ్లారు. రేపు సాయంత్రం నరేంద్ర మోడీని పవన్ కల్యాణ్ కలుస్తారు. ఈ భేటీలో రెండు రాష్ట్రాల్లో నీటి వాటాల పంపకాలు, విద్య, వైద్యం, అభివృద్ధి తదితర అంశాలపై మోడీతో చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications