అగ్రిగోల్డ్ కేసులో కొత్త మలుపు: ఏపీ సీఐడీకి సుప్రీంకోర్టు నోటీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అగ్రిగోల్డ్ కేసులో కొత్త ట్విస్ట్. మంగళవారం నాడు ఇది కొత్త మలుపు తిరిగింది. ఏపీ సీఐడీకి, ముగ్గురు అగ్రిగోల్డ్ డైరెక్టర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది మధ్య తరగతి కుటుంబాలను అగ్రిగోల్డ్ రోడ్డున పడేసిన విషయం తెలిసిందే.

New Twist in Agri Gold case

దీనిపై సుప్రీంకోర్టు గడప తొక్కారు. వేల కోట్ల రూపాయలను డిపాజిట్లుగా సేకరించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం మెచ్యూరిటీ తీరిన బాండ్లకు సొమ్ము చెల్లించలేకపోయింది. దీంతో డిపాజిటర్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు.

కేసులు నమోదైన చాలా కాలం తర్వాత అగ్రిగోల్డ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేయగా, వారికి ఇటీవలే బెయిల్ లభించింది. అయితే ఈ బెయిళ్లను రద్దు చేయాలని కోరుతూ.. సుప్రీంలో వారు పిటిషన్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. బెయిల్ లభించిన ముగ్గురు అగ్రిగోల్డ్ డైరెక్టర్లతో పాటు కేసును దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New Twist in Agri Gold case. Supreme Court sent notices to AP CID.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి