• search
 • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్, అది అసలు లాంచీ కాదు! అఖిలప్రియకే షాకిచ్చారు

|
  Krishna River Boat Mishap : బోటు ప్రమాదంలో మరో ట్విస్ట్ | Oneindia Telugu

  విజయవాడ: కృష్ణా నదిలో బోటు పడవ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆ బోటు చేపల పడవగా తెలుస్తోంది.

  నదిలో పడిపోవడం చూసి: బోటు ప్రమాదంలో వీరిద్దరే హీరోలు, ప్రయత్నించినా కొందరు కొట్టుకుపోయారు

  డబ్బుల సంపాదన కోసం సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవనే తీసుకు వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి బోటుగా మార్చారని తెలుస్తోంది.

  బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు

  చేపల పడవకు ఉపయోగించే బోటు

  చేపల పడవకు ఉపయోగించే బోటు

  ప్రమాదానికి గురైన బోటును మంగళవారం అధికారులు బయటకు తీశారు. దీనిని పరిశీలించారు. అది చేపల వేటకు ఉపయోగించే బోటుగా అధికారులు, మత్స్యకారులు నిర్ధారించారు. గతంలో చేపల వేటకు ఉపయోగించిన ఓ బోటును కాకినాడలో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

  నదిలా లాంచీ మాదిరి తిరిగేది కాదు

  నదిలా లాంచీ మాదిరి తిరిగేది కాదు

  చేపల వేటకు ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేసి నదిలో తిరిగే లాంచీ మాదిరిగా మార్చారని అంటున్నారు. ఈ బోటుకు పది మందికి అటు ఇటుగా మాత్రమే తీసుకు వెళ్లే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని అంటున్నారు.

  అఖిలప్రియ ఆశ్చర్యం

  అఖిలప్రియ ఆశ్చర్యం

  నీటిలో తిరుగుతున్న పడవలకు అనుమతులపై ఇప్పుడు చర్చ సాగుతోంది. మంగళారం మంత్రి అఖిలప్రియ ప్రయివేటు బోటు మెంబర్స్‌తో భేటీ అయ్యారు. ఆ సమయంలో కొందరు వేసిన ప్రశ్న ఆశ్చర్యానికి గురి చేసింది. మేం ఏళ్లుగా పడవలు తిప్పుతున్నామని, ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకోవాలా, ఆ విషయం మాకు తెలియదు అని పడవల నిర్వాహకులు కొందరు అనడం అఖిలప్రియను ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా, కొత్త వాటర్ పాలసీని తీసుకు వస్తామని మంత్రి అఖిలప్రియ చెప్పిన విషయం తెలిసిందే.

  ఒప్పందం లేదు

  ఒప్పందం లేదు

  రాష్ట్రంలో ఆరు ప్రయివేటు సంస్థలు ఉన్నాయి. అవి విజయవాడలో మాత్రమే ఏపీటీడీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. గోదావరిపై ఒక్క ప్రయివేటు బోటుకు కూడా ఒప్పందం లేదు. వీటిని ఎందుకు వదిలేశారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు వీటిపై కమిటీలు వేయనున్నారు. ఆ తర్వాత పడవల నిర్వాహకులను ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకునేలా మాట్లాడనున్నారు.

  వీడియోపై ఇలా

  వీడియోపై ఇలా

  ఆదివారం ప్రమాదం జరిగిన పడవకు అనుమతి లేదని, ఆ పడవను తిప్పవద్దని అధికారులు అడ్డుకున్నారని తప్పు తమపైకి రాకుండా ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పర్యాటక శాఖ ప్రచారంలోకి తెచ్చింది. కానీ అదే వీడియోలో ఇక్కడ కాదు మీరు పున్నమిఘాట్‌కు వెళ్లండని, అక్కడ జనాలను ఎక్కించుకోండని అధికారి అన్నట్లు ఉంది తప్ప మీకు అనుమతి లేదని, పడవను తిప్పడానికి వీల్లేదని అందులో ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం.

  ఇదీ జరిగిందని అఖిలప్రియ

  ఇదీ జరిగిందని అఖిలప్రియ

  ఈ విషయమై మంత్రి అఖిలప్రియను విలేకరులు అడిగారు. దానిపై ఆమె మాట్లాడుతూ.. దుర్గాఘాట్‌ వద్ద తమ అధికారి అడ్డుకున్నారని, పున్నమిఘాట్‌ వద్ద తమ అధికారులు వెళ్లిపోయాక కిందిస్థాయి సిబ్బంది ఉన్నపుడు ఆ ప్రయివేటు పడవ నిర్వహకులు జనాలను ఎక్కించుకుని పవిత్ర సంగమం వైపు తీసుకువెళ్లారని చెప్పారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Minister for Tourism Bhuma Akhila Priya said a new water policy would be put in place soon in the State and boat licences would be cancelled under the new policy if it is found that safety measures were not implemented.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more