బోటు ప్రమాదంలో కొత్త కోణాలు: నిలిపేసినా.. ఎన్నో షాకింగ్ విషయాలు

Posted By:
Subscribe to Oneindia Telugu
  Boat capsizes in Vijayawada : బోటు ప్రమాదంలో తప్పు ప్రయాణికులదే !

  విజయవాడ: ఫెర్రీ ఘాట్ వద్ద బోటు ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెల్లడి అవుతున్నాయి. ప్రమాదానికి కారణమైన బోటు రివర్ బోటింగ్ సంస్థకు చెందినది. ఈ సంస్థకు స్పీడ్ బోటింగ్‌కు మాత్రమే అనుమతి ఉంది. పెద్ద బోట్లకు అనుమతి లేదు.

  ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!

   బోటు ప్రమాదం, షాకింగ్ విషయాలు

  బోటు ప్రమాదం, షాకింగ్ విషయాలు

  బోటు ప్రమాదం అనంతరం ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. రివర్ బోటింగ్ సంస్థలో ఏపీటీడీసీకి (పర్యాటక శాఖ) చెందిన నలుగురు అధికారులకు వాటాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అనుమతులు లేని రూట్లలోను వీటిని తిప్పుతున్నారు.

  బోటింగ్ నిలిపివేసినా, మంత్రి జోక్యంతో

  బోటింగ్ నిలిపివేసినా, మంత్రి జోక్యంతో

  రివర్ బోటింగ్ సంస్థపై ఫిర్యాదులు రావడంతో నెల క్రితం బోటింగ్ నిలిపివేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఆ తర్వాత ఓ మంత్రి జోక్యంతో తిరిగి పునరుద్ధరించారని ప్రచారం సాగుతోంది.

   ఉన్నతాధికారులే పెట్టుబడులు పెట్టారు

  ఉన్నతాధికారులే పెట్టుబడులు పెట్టారు

  ఏపీటీడీసీకి చెందిన అధికారుల అండదండలతో రివర్ బోటింగ్ యాజమాన్యం ఇష్టారీతిన పడవలను తిప్పుతోందని, ఇష్టారీతిగా వ్యవహరిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో అధికారులకే వాటాలు ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా, ఓ మేనేజర్‌కు కూడా వాటాలు ఉన్నాయని తెలుస్తోంది.

  స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు

  స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు

  ప్రమాదానికి గురైన బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్స్ వరకు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకొని స్పీడ్ బోటుకు మాత్రమే అనుమతులు కోరారు. పూర్తిస్థాయి అనుమతులు లేకుండానే నడిపినట్లుగా అధికారులు గుర్తించారు.

   తీవ్రంగా స్పందిస్తున్న ప్రభుత్వం

  తీవ్రంగా స్పందిస్తున్న ప్రభుత్వం

  కాగా, ఫెర్రి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. ఈ ప్రమాదంపై నివేదిక అందించేందుకు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కారకులైన వారిని ఎవరినీ వదలమని మంత్రి అఖిలప్రియ స్పష్టం చేశారు.

   పరారీలో సిబ్బంది

  పరారీలో సిబ్బంది

  పడవ ప్రమాదం ఘటనపై నిర్వాహకులపై ఐపీసీ 304 సెక్షన్‌ 2 కింద కేసు నమోదు చేస్తున్నామని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన అనంతరం ఆరుగురు సిబ్బంది అక్కడ నుంచి పరారయ్యారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Altogether, 38 people were on the boat, which belonged to a private tourism company. The boat did not have a licence to operate.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి