Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం

మనం నిర్మించుకునే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటు, ఇనుము, ఇసుకతో కూడిన కట్టడం కాదు.. అది మన జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తి కేంద్రం. యుగాల్లో మొదటి యుగమైన కృతయుగం నుండి నేటి కలియుగం వరకు మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలి మారినా, 'వాస్తు శాస్త్రం' ప్రాధాన్యత మాత్రం అలాగే ఉంది. అందరూ వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నా, కొందరికే ఎందుకు అఖండ విజయాలు వస్తున్నాయి? మరికొందరు ఎందుకు పరాజయం పాలవుతున్నారు? అనేది తెలుసుకుందాం.

ఇంటికి తూర్పు, ఉత్తరం దిక్కులు చాలా మంచివి.
కానీ, వాస్తు సరిగ్గా ఉన్నా కొందరికి మాత్రమే ఇవి ఐశ్వర్యాన్ని ఇస్తాయి.
జాతకంలో రవి, బుధ గ్రహాల స్థితిని బట్టి ఈ దిక్కుల ఫలితం ఆధారపడి ఉంటుంది.

Vastu While there are certain advantages there are some disadvantages Care must be taken to avoid wasteful spending

దక్షిణం అంటే భయపడే వారు చాలామంది.
కానీ, జాతకంలో కుజ గ్రహం బలంగా ఉన్నవారికి ఇదే దిక్కు
ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది.
పదవులను, అధికారాన్ని, పేరుప్రతిష్ఠలను కట్టబెడుతుంది.
రాజభోగాలను ఇచ్చే శక్తి దక్షిణానికి ఉంది.
అంత తక్కువగా అంచనా వేయకూడదు దక్షిణాన్ని.

పడమర దిక్కున ఇల్లు కట్టుకున్న వారిలో కొందరు కుబేరులవుతుంటారు.
మరికొందరు సర్వం కోల్పోతుంటారు.
దీనికి కారణం ఆ వ్యక్తి జాతకంలోని శని ప్రభావం.

ఇంటి వాస్తు ఎంత బాగున్నా, అది యజమాని జాతకానికి, నడుస్తున్న దశకు సరిపోవాలి.
జాతకం బాగున్నప్పుడు చిన్న చిన్న వాస్తు దోషాలు ప్రభావం చూపవు.
అలాగే వీధిపోట్లు కూడా ప్రభావాన్ని చూపలేవు.
జాతకం బలహీనంగా ఉండి, వాస్తు కూడా తోడు కాకపోతేనే సమస్యలు ఎదురవుతాయి.
గ్రహ గతులు, వాస్తు స్థితిగతులు ఒకదానికొకటి తోడైనప్పుడే అదృష్టం మీ తలుపు తడుతుంది.

వాస్తులో వీధిపోటు అనగానే అందరూ భయపడతారు.
నిజానికి 'పడమర నైరుతి' వీధిపోటు తప్ప,
మిగిలినవన్నీ జాతకరీత్యా కలిసివచ్చేవే.
మీ లగ్నం, మీ రాశికి ఆ వీధిపోటు ఇచ్చే శక్తి తోడైతే,
అది మీకు ఊహించని అభివృద్ధిని ఇస్తుంది.

చాలామంది ఈశాన్య దిక్కుకు ఈశ్వరుడే అధిపతి అని భ్రమపడుతుంటారు.
కానీ శాస్త్రం చెప్పేదేమిటంటే.. 8 మంది దిక్పాలకులలో ఒకరైన 'ఈశాన్యుడు' వేరు,
సమస్త లోకాలకు అధిపతి అయిన 'పరమేశ్వరుడు' వేరు.
అనంతమైన విశ్వానికి అధిపతి అయిన మహాదేవుడిని ఒక మూలకు లేదా ఒక దిక్కుకు
పరిమితం చేయడం ధర్మశాస్త్ర రీత్యా సరికాదు.
ఈశాన్యం అనేది ఒక శక్తి క్షేత్రం మాత్రమే.
పరమశివుడు సర్వవ్యాపి.

మీకు ఇప్పుడు నడుస్తున్న దశ ఏమిటి?
మీ లగ్నానికి ఏ దిక్కు బలాన్నిస్తుంది?
ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వాస్తును అనుసరిస్తే..
మీ ఇల్లు మీకు కేవలం నివాసం మాత్రమే కాదు,
ఒక అదృష్ట దేవాలయంగా మారుతుంది.
ఏది ఏమైనా, జాతకానికి-వాస్తుకి పొంతన కుదిరినప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+