'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ 'దురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే 200 కోట్లకు పైగా సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. లాంగ్ వీకెండ్ ముగిసే ముగిసే సమయానికి ఈ సినిమా దాదాపు రూ.500 కోట్ల మైలురాయిని దాటుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఓ వైపు కలెక్షన్ల వర్షం కురుస్తుంటే.. మరోవైపు ఈ సినిమా కంటెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాజీ ఎంపీ రమ్య (దివ్య స్పందన) ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. దురంధర్ 2 సినిమాను ఆమె ఒక "ఎండ్యూరెన్స్ టెస్ట్" (ఓపికకు పరీక్ష) గా అభివర్ణించారు. ముగింపు లేని ఓ మొండి పాఠ్యపుస్తకాన్ని చదివినట్లుగా ఈ సినిమా సాగిందని.. విసుగు చెందిన ప్రేక్షకులు థియేటర్లలో చివరకు అసహనంతో నవ్వుకునే పరిస్థితి వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రేక్షకులు తమ విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా ఈ సినిమాను థియేటర్లలో చూడటం మానేయాలని ఆమె గట్టిగా సూచించారు.

Dhurandhar 2 Review Star Heroine Ramya Slams Ranveer Singh Film as Unwatchable Propaganda

రణవీర్ సింగ్ నటనపై షాకింగ్ కామెంట్స్
ముఖ్యంగా రణవీర్ సింగ్ నటనపై రమ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రణవీర్ సింగ్ ఈ సినిమాను తన భుజాలపై మోశారన్న వాదనను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. రణవీర్ పెర్ఫార్మెన్స్ కంటే ఆయన జుట్టుకే స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువగా ఉందని.. దానికి బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు ఇవ్వొచ్చని ఆమె ఎగతాళి చేశారు. మొదటి భాగంలో ఉన్న ఎనర్జీ, థ్రిల్, ప్రేక్షకుల్లో కనిపించిన ఉత్సాహం ఈ సీక్వెల్‌లో మచ్చుకైనా కనిపించలేదని.. థియేటర్లలో విజిళ్లు వేసే ఒక్క సన్నివేశం కూడా లేకపోవడం విచారకరమని ఆమె పేర్కొన్నారు.

ఓ పాతకాలపు ప్రచార చిత్రం
సినిమాలో చూపించిన మితిమీరిన హింస, లాజిక్ లేని యాక్షన్ సీన్లపై కూడా రమ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వస్తువును ఆయుధంగా మార్చి చూపించడం హాస్యాస్పదంగా ఉందని.. వాస్తవానికి దూరంగా ఉన్న యాక్షన్ ఘట్టాలతో దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకులను విసిగించారని విమర్శించారు. అంతేకాకుండా, ఇది ఒక పాతకాలపు ప్రచార చిత్రం అని.. కేవలం ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఇలాంటి కంటెంట్‌ను రూపొందించారని ఆమె ఘాటుగా విమర్శించారు. దర్శకుడి అతివిశ్వాసం వల్లే సినిమా నాణ్యత లోపించిందని ఆమె తన రివ్యూలో తేల్చిచెప్పారు.

ప్రస్తుతం రమ్య చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. రణవీర్ సింగ్ ఫ్యాన్స్ రమ్యపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండటం వల్లే రమ్య ఈ సినిమాపై నెగటివ్ కామెంట్స్ చేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే మరికొందరు సినీ విశ్లేషకులు మాత్రం రమ్య మాటల్లో నిజం ఉందని.. కేవలం ప్రచారం కోసమే సినిమాను తీశారని, మేకింగ్‌లో క్వాలిటీ లోపించిందని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఉన్నప్పటికీ.. కంటెంట్ విషయంలో మాత్రం 'దురంధర్ 2' మిశ్రమ స్పందనను ఎదుర్కొంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+