టైర్ పేలి చెట్టుకు ఢీకొన్న కారు, న్యూస్ రీడర్ మృతి
ఏలూరు: ప్రముఖ న్యూస్ రీడర్ బద్రి ఆదివారం ఉదయం దుర్మరణం చెందారు. బద్రి తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్తుండగా జిల్లాలోని ద్వారకా తిరుమల సమీంలో కారు టైర్ పేలి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బద్రి అక్కడికక్కడే మృతి చెందారు.
అతని భార్య, పిల్లలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని ఏలూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వీరు వెనుక సీటులో కూర్చున్నారు. ప్రమాదం సమయంలో ముందు సీటులో ఉన్న బద్రి చెట్టుకు ఢీకొనడంతో మృతి చెందారు.

ఈ ప్రమాదం పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం లక్ష్మీనగర్ వద్ద జరిగింది. ద్వారకా తిరుమల వద్ద శనివారం రాత్రి అతను బంధువుల వివాహానికి హాజరై, ఆదివారం ఉదయం తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. బద్రి భార్య, పిల్లలు, సోదరుడికి గాయాలయ్యాయి.
కారు ప్రమాదం జరిగిన సమయంలో బద్రి తన స్వగ్రామమైన ఉంగుటూరుకు మరి కొద్ది నిమిషాల్లో చేరుకునేలోపే ఇది జరిగింది. డ్రైవర్ పక్క సీటులో ఉండగా.. బద్రి స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఆయన పదేళ్లుగా ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ రీడర్‌గా పని చేస్తున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications