ఏపీలో ఎన్ఐఏ తనిఖీలు; దివంగత మావోయిస్ట్ ఆర్కే, విరసంనేతల ఇళ్ళలో ఏకకాలంలో సోదాలు!!
మావోయిస్టు పార్టీ నేతలకు చెక్ పెట్టేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్న వారిపై నజర్ పెట్టింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న అనుమానంతో కొంతమంది ఇళ్లపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంపై, అలాగే విరసం నేతల నివాసాలపై దాడి చేసిన ఎన్ఐఏ బృందాలు మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కూపీ లాగే ప్రయత్నంలో ఉన్నారు.

ఏపీలో దివంగత మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే, విరసం నేతల ఇళ్ళల్లో ఎన్ఐఏ సోదాలు
దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కళ్యాణ్ రావు, విరసం కార్యకర్త దొడ్డి ప్రభాకర్ ఇంటిపై దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్న ఎన్ఐఏ బృందం ఉదయం నుండి తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ లోని దొడ్డి ప్రభాకర్ ఇంట్లోనూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈరోజు తెల్లవారుజాము నుండే స్థానిక ఆర్మ్డ్ రిజర్వు ఫోర్స్ సహాయంతో ఎన్ఐఏ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం నుండి మావోయిస్టులకు నగదు బదిలీ జరిగినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందానికి సమాచారం అందడంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

అజిత్ సింగ్ నగర్ లో చత్తీస్ గడ్ వాసులకు ఆశ్రయం.. వారిపై ఆరా
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని విప్లవ రచయితల సంఘం (విరసం) కార్యకర్త దొడ్డి ప్రభాకర్ ఇంటిని చుట్టుముట్టి ప్రభాకర్ ఇంటిని ఉదయం నుంచి సోదాలు చేస్తోంది. ప్రభాకర్‌కు సిపిఐ-మాయిస్ట్ పార్టీకి చెందిన నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తూ, పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నలుగురు యువకులకు ప్రభాకర్ ఇంటి సమీపంలో వసతి కల్పించడంపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు.

మావోయిస్ట్ గ్రూప్ కు ఏమైనా సహకరిస్తున్నారా? తనిఖీలు చేస్తున్న ఎన్ఐఏ
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారు ఆ ఇంట్లో ఎంత కాలంగా ఉంటున్నారు? ప్రభాకర్‌తో వారికి ఉన్న సంబంధం, నిషేధిత మావోయిస్టు గ్రూపుతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభాకర్ ఇంటికి వచ్చిన అతిథుల వివరాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అనుమానితులను మావోయిస్టు సానుభూతిపరులు ఎవరైనా కలిశారా తదితర వివరాలపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆరా తీస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోనూ దివంగత ఆర్కే ఇంట్లో సోదాలు.. మావోలకు నగదు పంపినట్టు అనుమానం
ఇక ఇదే సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు లోని దివంగత మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష ఇంట్లోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆర్కే భార్య తాను ఇంట్లో లేని సమయంలో ఎన్ఐఏ సోదాలు చేపట్టిందని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ తాను చికిత్స కోసం విజయవాడకు వెళ్లానని ఆమె తెలిపారు. భర్తను, కొడుకును పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను విచారణల పేరుతో, సోదాల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని ఆర్కే భార్య శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని శిరీష పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications