హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ రాకెట్: నైజీరియన్ సహా పలువురి అరెస్ట్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని పోలీసులు బుధవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెంగుళూరు కేంద్రంగా రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని తెలిపారు.

పట్టుబడిన డ్రగ్స్ కేసులో నైజీరియన్ నమెకా, జాన్ పీటర్, నిజ్జూ, సోహెబ్, రాహుల్ ప్రదీప్, జుబీన్‌లను అరెస్ట్ చేశామని చెప్పారు.
ఈ డ్రగ్స్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆయన తెలిపారు. డ్రగ్ రాకెట్‌లో ప్రదీప్, జుబీన్ కీలకమని వెల్లడించారు. డ్రగ్‌ను గ్రాముకు నాలుగు వేలకు అమ్ముతున్నారన్నారు.

డ్రగ్ రాకెట్‌పై దర్యాప్తు కొనసాగుతుందని ఆయన చెప్పారు. నిందితుడు పీటర్‌పై పాత కేసులు ఉన్నాయని అనురాగ్ తెలిపారు. పోలీసులు నిందితుల నుండి అరవై గ్రాముల కొకైన్‌తో పాటు ఇతర మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక, మహారాష్ట్రల నుండి గ్యాంగులు వచ్చి డ్రగ్స్‌ను అమ్ముతున్నాయి.

డ్రగ్ 1

డ్రగ్ 1

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో డ్రగ్ సరఫరా చేస్తున్న వారిని నగర పోలీసులు అరెస్టు చేసి బుధవారం విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు.

డ్రగ్ 2

డ్రగ్ 2

కర్నాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్ సరఫరా జరుగుతోందని నగర కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు, డబ్బులు, సెల్‌ఫోన్‌లను చూపిస్తున్న అనురాగ్.

డ్రగ్ 3

డ్రగ్ 3

కర్నాటక రాజధాని బెంగళూరు కేంద్రంగా నగరంలో డ్రగ్ సరఫరా జరుగుతోందని నగర కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలు, డబ్బులు, సెల్‌ఫోన్‌లను చూపిస్తున్న అనురాగ్.

డ్రగ్ 4

డ్రగ్ 4

ఈ డ్రగ్స్ మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయని సిపి అనురాగ్ శర్మ తెలిపారు. డ్రగ్ రాకెట్‌లో ప్రదీప్, జుబీన్ కీలకమని వెల్లడించారు.

డ్రగ్ 5

డ్రగ్ 5

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో డ్రగ్ సరఫరా చేస్తున్న వారిని నగర పోలీసులు అరెస్టు చేసి బుధవారం విలేకరుల ముందు ప్రవేశ పెట్టారు. నైజీరియన్‌ను తీసుకు వెళ్తున్న పోలీసులు.

English summary
A drug racket involving a Nigerian, who had been flying to India on business visa for past few months, was busted by the Hyderabad police on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X