వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమరావతిలో నైట్ సఫారి...ఎపిలో న్యూ ఎకో టూరిజం సందడి...

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఎపిలో టూరిజం...ఎకో టూరిజం కొత్తపుంతలు తొక్కనున్నాయా...మనం ఎన్నడూ చూడని సరికొత్త ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కు తరలిరానున్నాయా? అంటే అవుననే అంటున్నారు అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు. గుంటూరులోని పర్యావరణ భవన్‌లో అటవీ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం సందర్భంగా మంత్రి ఈ విషయాలను వెల్లడించారు.

ఎపి రాజధాని అమరావతిలో సింగపూర్‌ తరహాలో నైట్‌ సఫారీ ఏర్పాటు చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. దీంతో పాటు గుంటూరు నగరవనంలో రెండు కొండలను కలుపుతూ రోప్‌ వే, కొండవీడు వద్ద మినీ జూను ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి చెప్పారు. వైజాగ్‌ జూ ను రూ.36 కోట్లతో అధునికరించటంతో పాటు తిరుపతి జూ ను అధునీకరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో నగరవనంను ఏర్పాటు చేస్తున్నట్తు తెలిపారు. నెల్లూరు నగరవనాన్ని 15 రోజులలో, చీరాల నగరవనాన్ని
రెండు నెలలో పూర్తి చేస్తామన్నారు. అలాగే విజయవాడలోని సైన్స్‌ సెంటర్‌ను ఆధునీకరిస్తున్నట్లు మంత్రి శిద్దా తెలిపారు. తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలలో సైన్స్‌ సెంటర్స్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

Night Safari at Amravati ... New eco tourism projects in AP

గ్రీనరీ గురించి...
మొక్కల గురించి...
మొక్కలను నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీ శాఖ అధికారులపై ఉందన్నారు. 2029నాటికి రాష్ట్రంలో 50శాతం గ్రీన్‌ కవరేజీ సాధించేందుకు నర్సరీల్లో మంచి మొక్కలను పెంచాలన్నారు. కొండల్లో పచ్చదనం పెంపుదలకు చర్యలు చేపట్టాని మంత్రి అధికారులను ఆదేశించారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను జవనవరి 15లోపు తిరుపతి గోడౌన్‌కు తరలించాలని అధికారులను మంత్రి శిద్దా రాఘవరావు అదేశించారు.

English summary
AP Forest Minister Shiddha Raghava Rao said the night safari would be set up in capital of AP in Amaravati. Apart from this, the ropeway connecting the two hills in Guntur city and mini zoo at Kondavedu will be set up. The Vizag Zoo has been upgraded to Rs 36 crore and is expected to be upgraded to Tirupati zoo. Minister also said that the Science Center in Vijayawada is modernized.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X