నిషిత్ యాక్సిడెంట్‌ను అతను లైవ్‌లో చిత్రీకరించాడు: అమ్మకానికి మీడియాతో బేరం!

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో అస్పష్టంగా రికార్డయిన దృశ్యాలు మాత్రమే లభించాయి.

హైదరాబాద్: ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీలో అస్పష్టంగా రికార్డయిన దృశ్యాలు మాత్రమే లభించాయి. అయితే దీనికి సంబంధించిన స్పష్టమైన విజువల్స్ తన వద్ద ఉన్నాయని ఓ వ్యక్తి ఒక మీడియా చానెల్ కు సమాచారం అందించాడు.

అయితే ఆ వీడియోను తాను అమ్మాలనుకుంటున్నానని, కొనే ఉద్దేశం ఉంటే సంప్రదించాలని మెయిల్ చేశాడు. దీంతో ఆధారాలు చూపించాలంటూ సదరు మీడియా యాజమాన్యం కోరడంతో.. కొన్ని స్క్రీన్ షాట్స్ తీసి పంపినట్లుగా తెలుస్తోంది. నిషిత్ కారు ప్రమాదానికి గురైన సమయంలో తాను యాదృచ్ఛింగా అక్కడే ఉన్నానని, ఆ సమయంలో ప్రమాద దృశ్యాలను చిత్రీకరించానని అతను పేర్కొన్నట్లు సమాచారం.

nishit video visuals for sale by an unknown person

మరి సదరు వ్యక్తి నుంచి వీడియో కొనుగోలు చేయడానికి ఆ మీడియా యాజమాన్యం ఓకె చెప్పిందా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు. కాగా, రాత్రి 2.45గం. సమయంలో నారాయణగూడ నుంచి జూబ్లీహిల్స్ మీదుగా వెళ్తుండగా నిషిత్ కారు మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నిషిత్ తో పాటు అతని స్నేహితుడు రాజా రవి కూడా దుర్మరణం పాలయ్యాడు. గురువారం నాడు పెన్నా తీరం ఒడ్డున నిషిత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+