ఒప్పందం: ద్వేషభావం ఉంటే పాపమని సోనియాపై జగన్

'No bitterness against Sonia Gandhi'
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల నాటికి కాంగ్రెసుతో జత కడతారని తెలుగుదేశం పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. జగన్‌కు బెయిల్, విభజన అన్నీ ఒప్పందంలో భాగమేనని వారు ఆరోపిస్తున్నారు.

ఇలాంటి సమయంలో పొత్తులపై పార్టీ నేత దాడి వీరభద్ర రావు చేసిన వ్యాఖ్యలతో మదనపడ్డ జగన్ మందలించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలుస్తాయనే అంశాన్ని సీమాంధ్రలో ప్రజల్లోకి మరింత జోరుగా తీసుకు వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతోందట.

కాగా, రెండు రోజుల క్రితం జగన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తును దేవుడు నిర్ణయిస్తాడని తాను భావిస్తానని చెప్పారు. దేవుడిని నమ్మే వారికి ఎలాంటి ఇతరులను ద్వేషించే గుణం ఉండకూడదని, అలా ఉంటే అది పాపం అవుతుందని చెప్పారు.

కాగా, ఎల్బీ స్టేడియంలో ఈ నెల 26న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సభకు హాజరయ్యే కార్యకర్తల వాహనాల పార్కింగ్ కోసం స్థలాలను ఎంపిక చేశారు. ఎపిఎస్పీకి చెందిన 34 ప్లటూన్లతోపాటు కేంద్ర పారా మిలటరీకి చెందిన పదహారు కంపెనీలను రంగంలోకి దింపుతున్నారు. 1800 మంది సివిల్ పోలీసులను బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+