అవిశ్వాసంపై లోకసభలో ఎల్లుండే చర్చ, స్పీకర్ ఖరారు: 'వైసీపీ సభ్యులు లేని టైం చూసి..'
Recommended Video

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి శుక్రవారం మొత్తం అవిశ్వాసం తీర్మానంపై చర్చించనున్నారు. బీఏసీ నిర్ణయించింది. స్పీకర్ కార్యాలయం అవిశ్వాస తీర్మానంపై చర్చా తేదీని విడుదల చేసింది. మరోవైపు, వచ్చే సోమవారం రాజ్యసభలో ఏపీ అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.
చదవండి: సీఎం ఐతే బాబుపై ప్రతీకారం తీర్చుకోను కానీ: జగన్ మెలిక, పవన్ మాట విన్నవారు నాకూ ఓటేస్తారు
అవిశ్వాసం తీర్మానం నోటీసు పైన శుక్రవారం చర్చ జరుగుతుందని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు లేని సమయం చూసి అవిశ్వాసంపై చర్చకు ఓకే చెప్పారని విమర్శించారు. దీంతో బీజేపీ, వైసీపీ మధ్య కుట్ర రాజకీయాలు మరోసారి వెలుగు చూశాయని వ్యాఖ్యానించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీఏసీలో కూడా నిర్ణయం తీసుకున్నారని సుజనా చౌదరి అన్నారు. అవిశ్వాసంపై రాజ్యసభలో కూడా చర్చ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ చేస్తున్న పోరాటానికి అందరూ సహకరించాలన్నారు.
అవిశ్వాసంపై చర్చ ఎప్పుడంటే..?
లోకసభలో ఎల్లుండి (శుక్రవారం) అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చర్చ జరుగుతుంది. ప్రశ్నోత్తరాలు రద్దు చేసి శుక్రవారం మొత్తం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుపుతారు. టీడీపీ తీర్మానంపై చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించింది.












Click it and Unblock the Notifications