Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్‌తో గొడవలా, కాంగ్రెస్ నయం: బాబు మాట మారింది, మోడీ-పవన్‌పై నిప్పులు

అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై మాట్లాడలేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం వీగిపోయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని ఏపీ అభివృద్ధిపై మాట్లాడకుండా, అదే నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. ఇంతటి బాధ్యతారాహిత్య కేంద్రాన్ని గతంలో చూడలేదన్నారు.

Recommended Video

    గల్లా జయదేవ్ ప్రసంగం పై పవన్ కళ్యాణ్ ట్వీట్లు

    బీజేపీ దుర్మార్గ వైఖరి చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వమే నయమనే అభిప్రాయం కలుగుతోందన్నారు. కాగా, చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఒకింత అనుకూలంగా మాట్లాడటం చర్చనీయాంశమైన అంశమే. మోడీ మాట్లాడుతూ మన దేశభక్తిని శంకించారని, ఇది ఆక్షేపమనీయమన్నారు. అవిశ్వాస తీర్మానానికి సహకరించిన వారికి థ్యాంక్స అన్నారు.

    No Confidence Motion: Chandrababu counter to Modi

    నాపై మోడీ ఎదురుదాడి చేశారు, ఆ మాటలు బాధించాయి

    బీజేపీ ప్రభుత్వం నీతి తప్పారని, ధర్మాన్ని పాటించలేదన్నారు. ఎన్డీయేకు మెజార్టీ ఉందని తమకు తెలుసునని చెప్పారు. మోడీ నాపై ఎదురుదాడి చేశారన్నారు. కేంద్రం తన ధర్మాన్ని పాటించకపోవడం వల్లే అవిశ్వాసం పెట్టామన్నారు. అహంకారంతో అవిశ్వాసం పెట్టారని, వ్యాఖ్యానించారని, ఈ మాటలు బాధించాయన్నారు. వారికే అహంకారం అన్నారు.

    ఏపీలో భాగం కాదన్నట్లుగా మాట్లాడారు

    కేసీఆర్‌కు, తనకు ఏదో వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లుగా మోడీ మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ భారత్‌లో భాగం కాదన్నట్లు మాట్లాడారని మండిపడ్డారు. నేను యూటర్న్ తీసుకున్నట్లుగా కూడా మాట్లాడారన్నారు. అవిశ్వాసం పెట్టిన మాకు కాదని, ప్రధానికే అహంకారం అన్నారు. ప్రధాని చాలా చులకనగా మాట్లాడారన్నారు. ప్రధాని స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడారా అని ప్రశ్నించారు.

    ఏపీకి అన్యాయం జరిగింది కాబట్టే చివరి అస్త్రంగా అవిశ్వాసం ప్రయోగించామన్నారు. ఏపీ ప్రజల సెంటిమెంటును పట్టించుకోలేదన్నారు. న్యాయం చేయాలని ప్రధాని మోడీని కోరామని చెప్పారు. అసలు మీరు ఎక్కడ న్యాయం చేశారని, న్యాయం చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. 5 కోట్లమంది ప్రజలు అంటే మీకు చులకనా అని ప్రశ్నించారు. తెలుగు జాతి అంటే లెక్క లేకుండా మాట్లాడారన్నారు.

    ప్రధాని చులకనగా మాట్లాడారు

    ప్రధాని చులకనగా, చౌకబారు మాటలు మాట్లాడారన్నారు. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది మద్దతు పలికారని చెప్పారు. అణిచివేసే ధోరణితో కేంద్రం వ్యవహరించిందని నిప్పులు చెరిగారు. నాకు, కేసీఆర్‌కు గొడవలు ఉన్నట్లుగా మాట్లాడారన్నారు. ప్రత్యేక హోదాకు 14వ సంఘం సిఫార్సులు అడ్డువచ్చాయని చెప్పడం విడ్డూరమన్నారు. 11 రాష్ట్రాలకు హోదా ఇచ్చి మాకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. మీ దురుద్దేశ్యం ఏమిటి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారన్నారు.

    జగన్, పవన్ కళ్యాణ్ లాంటి వారు మనపై దాడి చేస్తూ బీజేపీని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మోడీ చాలా దుర్మార్గంగా మాట్లాడారన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టామో మోడీకి తెలియదా అని ప్రశ్నించారు. కానీ ఏదో తనను పడగొట్టాలని పెట్టినట్లుగా చెబుతున్నారన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు తాము అవిశ్వాసం పెట్టిన విషయం తెలియదా అన్నారు.

    ఓట్లు వేయకున్నా ఫర్వాలేదనే ధీమానా?

    125 కోట్ల మంది ప్రజల మద్దతు ఉందని చెప్పారని, అందులో ఏపీకి చెందిన 5 కోట్ల మంది లేరా అని ప్రశ్నించారు. ఏపీకి న్యాయం చేయాలని తాను ఢిల్లీకి 29సార్లు వెళ్లానని చెప్పారు. సమస్యలు సరిచేస్తానని కనీసం పది నిమిషాలు ఎందుకు మాట్లాడలేదన్నారు. అవినీతి పార్టీని పక్కన పెట్టుకొని, ఆ పార్టీతో మమ్మల్ని పోలుస్తారా అని మండిపడ్డారు. అవినీతి పార్టీతో చేతులు కలిపి అన్యాయం చేస్తారా అన్నారు. ఐదు కోట్ల మందికి నిరాశ ఎదురైందన్నారు. మనకు నెంబర్ లేదనే ప్రధాని ధీమా అన్నారు. ఓట్లు వేయకున్నా పర్వాలేదనే ప్రధాని ఉద్దేశ్యం అన్నారు.వైసీపీకి మేలు జరుగుతుందనేలా మాట్లాడారు

    అన్యాయం జరిగినప్పుడు ఆదుకోవల్సిన ధర్మం మీది కాదా అని ప్రశ్నించారు. ఎస్పీవీ పెట్టుకుంటే డబ్బులు ఇస్తామని చెబుతున్నారని విమర్శించారు. మా కేంద్రమంత్రుల రాజీనామాకు ముందు తనతో మాట్లాడారని, వైసీపీకి మేలు జరుగుతుందనేలే మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. పవన్ ఇప్పుడు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని, వైసీపీ వాళ్లు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పదవి నుంచి దించేందుకు అవిశ్వాసం పెట్టినట్లు మోడీ మాట్లాడటం సరికాదన్నారు.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్రానికి జరుగుతున్న పోరాటమని, ఇందులో రాజీలేదని తేల్చి చెప్పారు. వైసీపీ ఎంపీల రాజీనామా డ్రామా అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాజీ లేదని తేల్చి చెప్పానని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే ఢిల్లీకి వచ్చి సభ్యుల మద్దతు కూడగడతానని పవన్ ప్రకటించారని, కానీ ఏది అని ప్రశ్నించారు. తమిళనాడులో కావేరీ ఇష్యూకు సంబంధించి ఆ రాష్ట్రానికి చెందిన వారు ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉందన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+