వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవిశ్వాసంపై బీజేపీ అదే ప్లాన్!: సభలో టీఆర్ఎస్ ఎందుకిలా... టీడీపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందా అంటే కావొచ్చునని అంటున్నారు. శుక్రవారం టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండానే మురిగిపోయింది. సోమవారం కూడా అలాగే జరిగింది.

చులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబుచులకనగా చూశారు, జగన్ అండతో అణగదొక్కాలని: మోడీ-పవన్‌లపై చంద్రబాబు

కేంద్రంపై టీడీపీ, వైసీపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సోమవారం ఎలాంటి టర్చ జరగలేదు. సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. ఆమె టీడీపీ, వైసీపీల అవిశ్వాస తీర్మానాలను స్వీకరించారు.

ఏపీలో పొలిటికల్ హీట్, ఏం జరగనుంది.. ఇంటెలిజెన్స్ ఆరా? కొందరి ప్రయివేటు సర్వేఏపీలో పొలిటికల్ హీట్, ఏం జరగనుంది.. ఇంటెలిజెన్స్ ఆరా? కొందరి ప్రయివేటు సర్వే

 రిజర్వేషన్లు, కావేరీ నీటిపై ఆందోళన

రిజర్వేషన్లు, కావేరీ నీటిపై ఆందోళన

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించేందుకు సభ్యులు వీలు కల్పించాలని కోరారు. కానీ కావేరీ అంశంపై అన్నాడీఎంకే సభ్యులు, రిజర్వేషన్ల అంశంపై టీఆర్ఎస్ సభ్యులు వెల్లోకి వెళ్లి నిరసన తెలిపారు. దీంతో సభ్యుల ఆందోళన మధ్య లోకసభను వాయిదా వేశారు.

 బీజేపీ వ్యూహాత్మకంగా

బీజేపీ వ్యూహాత్మకంగా

అవిశ్వాస తీర్మానంపై బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ వ్యూహంలో భాగంగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని, దీనిని చూపించి సభలో ఆర్డర్ లేదంటూ స్పీకర్ సభను వాయిదా వేస్తుండవచ్చునని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు సభలో టీఆర్ఎస్ నిరసనల పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మరోసారి అవిశ్వాస తీర్మానానికి రెడీ

మరోసారి అవిశ్వాస తీర్మానానికి రెడీ

ఇదిలా ఉండగా, మంగళవారం కూడా టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వనున్నాయి. సోమవారం అవిశ్వాసం నోటీసు స్వీకరించిన స్పీకర్.. నోటీసుపై చర్చించేందుకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. సభ్యులు సీట్లు కూర్చోవాలని కోరారు.

టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తోంది, కోల్‌కతా ఎందుకు?

టీఆర్ఎస్ ఎందుకిలా చేస్తోంది, కోల్‌కతా ఎందుకు?

లోకసభలో టీఆర్ఎస్ వ్యూహం ఏమిటో అర్థం కావడం లేదని టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో కేసీఆర్ ఏం చెప్పదలుచుకున్నారని, ఆయన కోల్‌కతాకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు రాష్ట్ర సమస్య అని దానిని పార్లమెంటుకు ముడిపెట్టి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేయడం సరికాదని, సమస్యను పక్కదారి పట్టించడం అన్యాయమన్నారు.

 మా ఆందోళన అవిశ్వాసానికి అడ్డంకి కాదు

మా ఆందోళన అవిశ్వాసానికి అడ్డంకి కాదు

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ కూడా అడ్డుపడుతోందనే అనుమానాలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ స్పందించారు. టీఆర్ఎస్, టీడీపీల మధ్య పోటీ లేదన్నారు. చంద్రబాబుకు పాలనాపరమైన సమస్యలు ఉంటే తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. తమ పార్టీ నిరసన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అడ్డు కాదని, 52 మంది ఎంపీల సంతకాలు చేస్తే సరిపోతుందన్నారు. నిరసనల మధ్యే స్పీకర్ మూడు చట్టాలు ఆమోదించారని గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు వస్తే అప్పుడు తమ అభిప్రాయం తెలియజేస్తామన్నారు.

English summary
The notices for no-confidence motion against the government could not be taken up in the Lok Sabha today due to noisy protests by several parties, which washed out the proceedings in both Houses of Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X