సంక్రాంతి గిఫ్ట్: బస్సుల్లో ఎక్స్‌ట్రా ఛార్జీల్లేవు, హెచ్చరిక
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవని, అలాగే ప్రయివేటు బస్సుల యజమానులు అదనపు ఛార్జీలు వసూలు చేయవద్దని మంత్రి శిద్దా రాఘవరావు సోమవారం అన్నారు.
అధిక చార్జీలు వసూలు చేయవద్దని ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశామని చెప్పారు. అధిక చార్జీలు వసూలు చేసే ప్రైవేటు ట్రావెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రాకు చెందిన బస్సులకు కొత్తగా వేసిన రంగులను మంత్రి శిద్దా సోమవారం బస్ భవన్‌లో పరిశీలించారు. సూపర్ లగ్జరీ నుంచి తెలుగు వెలుగు (పల్లె వెలుగు) బస్సుల వరకు వేసిన రంగులను ఆయన పరిశీలించారు.

శిద్దా రాఘవ రావు
ఈ సందర్భంగా శిద్దా రాఘవు రావు విలేకరులతో మాట్లాడారు. శుభ సూచికమనే ఆంధ్రాలోని కొత్త బస్సులకు పసుపు రంగు వేయిస్తున్నట్టు చెప్పారు.

శిద్దా రాఘవ రావు
రంగుపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేయడం తగదన్నారు. ఇప్పటి వరకు పల్లె వెలుగుగా ఉన్న బస్సులకు తెలుగు వెలుగుగా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు.

శిద్దా రాఘవ రావు
అలాగే గణతంత్ర దినోత్సవం నాడు విజయవాడలో ముఖ్యిమంత్రి చంద్రబాబు నాయుడు 100 బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు.

శిద్దా రాఘవ రావు
రాష్ట్రానికి ఇప్పటి వరకు 1100 బస్సులు మంజూరయ్యాయని అన్నారు. అందులో 400 బస్సులు ఇప్పటికే వచ్చాయని, మిగతా 700 బస్సులు మార్చిలోగా రోడ్లెక్కుతాయన్నారు.

శిద్దా రాఘవ రావు
అలాగే త్వరలోనే అన్ని బస్సుల్లో జిపిఎస్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. తద్వారా బస్సు ఎక్కడుంది? ఏ సమయానికి నిర్దేశిత ప్రదేశానికి చేరుకుంటుంది? ఎంత సేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటుంది? వంటి విషయాలను తెలుసుకోవచ్చన్నారు.

శిద్దా రాఘవ రావు
మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలందిస్తామని చెప్పారు.

శిద్దా రాఘవ రావు
తద్వారా నష్టల నుంచి ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు.

శిద్దా రాఘవ రావు
గత ప్రభుత్వాలు ఆర్టీసీని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గ్రామాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులను రద్దు చేశాయని శిద్ధా విమర్శించారు.

శిద్దా రాఘవ రావు
తమ ప్రభుత్వ హయాంలో చాలా గ్రామాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామని అన్నారు. త్వరలోనే మిగిలిపోయిన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

శిద్దా రాఘవ రావు
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం తన దగ్గరికి రాలేదన్నారు. యాజమాన్యం స్థాయిలోనే కార్మికుల సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమ్మె వ్యవహారం తన దగ్గరికి రాకుండానే సమసిపోతుందన్నారు.












Click it and Unblock the Notifications