ప్రత్యేక ప్రతిపత్తిపై తగ్గం, కానీ: మురళీ మోహన్
న్యూఢిల్లీ/ఏలూరు: ఏపీకి ప్రత్యేక ప్రతిపత్తిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు మురళీ మోహన్, రామ్మోహన్ నాయుడు శుక్రవారం అన్నారు. ప్రత్యేక ప్రతిపత్తిపై ఇప్పటికిప్పుడే ఒత్తిడి తెస్తే మిగతా రాష్ర్టాలతో సమస్య వస్తుందని వారు అన్నారు.
కేంద్ర మంత్రులను కలిసే ప్రతీ సందర్భంలోనూ ప్రత్యేక ప్రతిపత్తి అంశంపై మాట్లాడుతున్నామని చెప్పారు. రాజమండ్రిలో సమస్యగా మారిన బ్రిడ్జి ఆధునీకరణ కోసం కలకత్తా నుంచి ప్రత్యేక బృందం వస్తోందన్నారు. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు భారీగా కేంద్ర నిధులు సాధిస్తామన్నారు.
అధికారులపై చంద్రబాబుకు ఎమ్మెల్యే గద్దె ఫిర్యాదు

అధికారులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గన్నవరం విమానాశ్రయంలో ఆయనను కలిసి వితంతు, వృద్దాప్య, వికలాంగ పింఛను పాసు పుస్తకాలపై ప్రభుత్వ చిహ్నం, సీఎం ఫొటో లేవని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని బాబును కోరారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జగన్‌కు చంద్రబాబు చురకలు
మీరు దోచుకున్న డబ్బు చాలా ఉందని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని వైసీపీ అధ్యక్షులు జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించారు. అవినీతి సొమ్ముతో పెట్టుకున్న టీవీ చానళ్లు, పత్రికల్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ, వారి ఫొటోలు మాత్రమే వేసుకున్నారన్నారు.
ఇతరుల ఫొటోలు వేయలేదని, ఇలాంటి చర్యలతో అధికారం రాదనే విషయం తేలిపోయిందన్నారు. తాను ప్రసంగించిన తర్వాత ఎవరో ఓ నాయకుడు వస్తాడని, ఏదో గొణుగుతాడని ఆ వార్తలన్నింటినీ అవినీతి పత్రికలలో ప్రముఖంగా ప్రచురిస్తారన్నారు.












Click it and Unblock the Notifications