క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనాలు
ఈ నెల 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు టోకెన్ లేని భక్తులకు తిరుమలకు అనుమతి లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. భక్తులను తిరుమలకు రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
గత రెండు నెలలుగా వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్ల కోసం టీటీడీ అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారని బీఆర్ నాయుడు చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తోందని తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్ 30, 31, జనవరి 1వ తేదిలకు ఈ-డిప్ ద్వారా భక్తులకు టోకెన్లు కేటాయించామని చెప్పారు.

ఈరోజుల్లో టోకెన్ ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని, టోకెన్ లేని భక్తులు కూడా తిరుమలకు రావొచ్చని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే టోకెన్ లేని భక్తులకు దర్శనాలు లేకపోవటంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని వివరించారు. టోకెన్ పొందలేని భక్తులు జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా వైకుంఠ ద్వారా దర్శనాలు చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు.
భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామివారిని దర్శించుకోవచ్చని బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీసీ బస్సుల్లో బ్యానర్లు, తిరుపతిలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్రాడ్ కాస్టింగ్, టీటీడీ అధికారిక సోషల్ మీడియా, ఎస్వీబీసీ, ఇతర మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. టీటీడీ సూచనలు పాటిస్తూ భక్తులందరూ సంయమనంతో స్వామివారిని దర్శించుకోవాలని ఈ సందర్భంగా చైర్మన్ భక్తులకు తెలియజేశారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ప్రారంభం అయ్యే వైకుంఠ ద్వార దర్శనాలు జనవరి 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలి మూడు రోజుల కోసం మొత్తం 1,76,000 మంది భక్తులను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఎంపిక చేశారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
పాలకోసం ఏడుస్తుందని పసిదాన్ని చంపేసిన తల్లి.. తిరుపతి జిల్లాలో దారుణం -
నేటి నుంచి ఒంటమిట్ట రాములోరి ఆలయంలో.. !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications