ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు క‌ల‌త చెందారా?

ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు క‌ల‌త చెందారా? అనే ప్ర‌శ్న‌కు అయ‌న స‌న్నిహిత‌వ‌ర్గాలు ఔన‌నే స‌మాధానం ఇస్తున్నాయి. రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌ను ఎంపిక చేస్తున్నారంటూ వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ద్రౌప‌ది ముర్మును ఎన్డీయే ప్ర‌భుత్వం ఎంపిక చేసింది. త‌న‌ను ఎంపిక చేయ‌నుందుకు వెంక‌య్య‌నాయుడు ఆవేద‌న చెంద‌లేద‌ని, తెలుగు రాష్ట్రాల్లోని మీడియాలో త‌న‌పై వ‌చ్చిన క‌థ‌నాల‌వ‌ల్లే ఆయ‌న క‌ల‌త చెందారంటున్నారు.

 ఆగ‌స్టు వ‌ర‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడు

ఆగ‌స్టు వ‌ర‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెంక‌య్య‌నాయుడు

ఆగ‌స్టు వ‌ర‌కు వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా కొన‌సాగుతారు. అప్పుడు ఎవ‌రిని నిల‌బెట్టాల‌నేది ఎన్డీయే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంది. వెంక‌య్య త‌న‌కు 70 సంవ‌త్స‌రాలు వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయాల నుంచి వైదొలుగుతాన‌ని ప్ర‌క‌టించారు. అయితే న‌రేంద్ర‌మోడీ టీం నుంచి వెంక‌య్య‌ను త‌ప్పిస్తున్నారని, మోడీకి, వెంక‌య్య‌కు దూరం పెరిగింద‌ని, చంద్ర‌బాబుతో, తెలుగుదేశం పార్టీతో చ‌నువుగా ఉండ‌టంవ‌ల్లే ఆయ‌న్ను దూరం పెట్టారంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి.

 తెలుగు రాష్ట్రాల్లోనే అస‌త్య ప్ర‌చారం

తెలుగు రాష్ట్రాల్లోనే అస‌త్య ప్ర‌చారం

అయితే వెంక‌య్య‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేయ‌నందుకు ఆయ‌న‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నారంటూ బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్ మండిప‌డ్డారు. ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఉప రాష్ట్ర‌ప‌తిగా ప‌నిచేసిన వ్య‌క్తిని గౌర‌వించే విధానం ఇదేనా? అంటూ ప్ర‌శ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి అక‌స్మాత్తుగా ఇప్పుడు వెంక‌య్య‌పై ప్రేమ పుట్టుకొచ్చింద‌ని ఎద్దేవా చేశారు.

 ఇక‌నైనా గౌర‌వం ఇవ్వ‌డం నేర్చుకోండి

ఇక‌నైనా గౌర‌వం ఇవ్వ‌డం నేర్చుకోండి


ప్ర‌పంచ యోగా దినోత్స‌వం కార్య‌క్ర‌మం కోసం సికింద్రాబాద్ వ‌చ్చిన వెంక‌య్య‌నాయుడు ఆ కార్య‌క్ర‌మం ముగిసిన వెంట‌నే హ‌డావిడిగా ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పార్టీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ఆయ‌న‌తో ఒక గంట స‌మావేశ‌మ‌య్యారు. ఆరోజు సాయంత్రానికి ద్రౌప‌ది ముర్మును అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. వెంక‌య్య‌తో స‌మావేశ‌మైన చ‌ర్చ‌ల గురించి ఎక్క‌డా ఒక్క విష‌యం కూడా బ‌య‌ట‌కు రాలేదు. కానీ తెలుగు మీడియాలోనే ర‌క‌ర‌కాల వార్త‌ల‌ను వండి వార్చారంటూ స‌త్య‌కుమార్ గుర్తుచేశారు. రాజ్యాంగ బ‌ద్ధ ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తికి గౌర‌వం ఇవ్వ‌డం ఇక‌నైనా నేర్చుకోవాలంటూ ఆయ‌న సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+