జగన్ దీక్ష హాస్యాస్పదం, ఒరిగేదేమీ లేదు: రాయపాటి
తిరుమల/ అనంతపురం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ దీక్షతో రాష్ర్టానికి ఒరిగేదేమీ లేదని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ రాయపాటి మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై తాము ఒత్తిడి తెస్తున్నామన్నారు. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంతో పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. 2,3 ఏళ్లలో ఎపిని దేశంలో అగ్రామిగా నిలుపుతామని చెప్పారు. ఎపికి కేంద్రం తప్పకుండా సాయం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడిది మోసపూరిత యాత్ర అని సిపిఎం నాయకుడు బీవీ రాఘవులు చెప్పారు. రైతుల భూములను లాక్కోవడానికి చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన శుక్రవారం అనంతపురంలో అన్నారు.
రాజధాని విషయంలో వైయ్ససార్ కాంగ్రెసు పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. రాయలసీమలో కరవును తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు పట్టించుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పోరాడం చేస్తామని రాఘవులు వివరించారు.












Click it and Unblock the Notifications