రాత్రి రోడ్డు ప్రమాదాలు కాకుండా ? బెజవాడ పోలీసుల అదిరిపోయే ఐడియా..!
మన దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. ఏటా రోడ్లపై జరిగే ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీటి నివారణకు పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పూర్తి స్దాయిలో ఫలితం ఉండటం లేదు. దీంతో ఎన్టీఆరి జిల్లా పోలీసులు మరో కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తోందని వారు చెప్తున్నారు.
రాత్రి సమయాల్లో రోడ్లు ప్రమాదాల నివారణకు ఎన్టీఆర్ జిల్లా పోలీసు కమిషనరేట్ సరికొత్త విధానం అమలు చేస్తోంది. రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో తిరువూరు హైవే సమీపంలో స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రిపూట రోడ్డుపై వెళ్తున్న వాహనాల్ని పోలీసులు ఆపుతారు. డ్రైవర్ ను కిందకు దించి మొహం కడిగిస్తారు. అనంతరం స్నాక్స్ ఇస్తారు. అనంతరం తిరిగి పంపించేస్తారు.. తద్వారా అలసిపోయిన డ్రైవర్లు అలర్ట్ అవుతారని పోలీసులు చెప్తున్నారు.

రాత్రి సమయాలలో ప్రధాన రహదారుల గుండా ప్రయాణించే వాహన డ్రైవర్లు నిద్రలేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వలన తెల్లవారు జామున 3 గంటల నుండి 5 గంటల ప్రాంతాలలో నిద్రలోకి జారుకుంటున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ కారణంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించారు. రోడ్డు ప్రమాదాల వలన ఎందరో ప్రాణాలను కోల్పోతున్నారని తెలిపారు.
ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ నేపధ్యంలో స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించాక చాలా వరకు రాత్రి సమయాలలో రోడ్డు ప్రమాదాలను తగ్గించగలుగుతున్నట్లు వారు వెల్లడించారు.












Click it and Unblock the Notifications