విషాదం: నూజివీడు ట్రిపుల్ ఐటీ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య

కృష్ణా: జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన టీ పరమేశ్వర జగన్నాథం(18) నూజివీడు ట్రిపుల్ ఐటీలో పీయూసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వసతి గృహంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గమనించిన తోటి విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని హుటాహుటిన స్థానిక ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. జగన్నాథం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై నూజివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Nuzvid triple IT student commits suicide

దంపతుల అనుమానాస్పాద మృతి.. పెళ్లైన నాలుగు నెలలకే
చిత్తూరు జిల్లా పాకాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలుగు నెలల క్రితం వివాహమైన భార్యభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భారతమిట్ట ప్రాంతానికి చెందిన సమియా(30), అల్తాఫ్ హుస్సేన్(32) భార్యాభర్తలు. వీరికి నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది.

కే వడ్డపల్లి గ్రామ సచివాలయంలో సమియా మహిళా పోలీసుగా విధులు నిర్వహిస్తున్నారు.

అల్తాఫ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గురువారం సమియా విధులకు హాజరుకాలేదు. దీనిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తోటి ఉద్యోగులు.. సమియా ఇంటికి వెళ్లి చూడగా.. భార్యభర్తలిద్దరూ బాత్రూంలో విగతజీవులుగా పడివున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమియా దంపతులది హత్యా.. ఆత్మహత్యా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+