భార్య స్నానం చేస్తుండగా చిత్రీకరిస్తున్నాడని...: కొంపలు ముంచిన అక్రమ సంబంధం

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: తన భార్య స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడాన్ని భర్త అడ్డుకున్నాడు. దీంతో ఆ యువకుడు ఆ మహిళ భర్తపై దాడి చేశాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. ఊబలంకకు చెందిన ఓ మహిళ ఈ నెల 27న స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన విజయ్‌ అనే యువకుడు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడం చూసిన భర్త అతనిని అడ్డుకున్నాడు.

వారి మధ్య పెద్ద గొడవే జరిగింది. విజయ్‌ అనే యువకుడు మహిళ భర్తను కొట్టి గాయపరిచాడు. కొత్తపేట ఏరియా ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

కాగా, తూర్పు గోదావరి జిల్లాలో ఓ వివాహేతర సంబంధం రెండు కుటుంబాల కొంపలు ముంచింది. గుబ్బలపాలెంలో కత్తిమండకు చెందిన కొల్లు ఏసు, తిరుమాని స్వాతి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం బయట పడటంతో పెద్దలు మందలించారు. అవమానానికి గురైన ఏసు, స్వాతి పురుగుమందు తాగి మృతి చెందారు.

Old man sexually abuses girl, lovers commit suicide in Andhra Pradesh

వీరికి వేర్వేరు వ్యక్తులతో వివాహాలయ్యాయి. స్వాతికి ఇద్దరు ఆడ పిల్లలు, ఏసుకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. స్వాతి భర్తతో కలిసి ఉండటం ఇష్టం లేక మరోక మహిళకు భర్త అయిన ఏసుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఏసుకు కూడా అతని భార్య అంటే ఇష్టం లేకనే స్వాతితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడని తెలుస్తోంది.

ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వీరిద్దరు శుక్రవారం సాయంత్రం మోటారుసైకిల్‌పై గుబ్బల పాలెం సెంటర్‌కు చేరుకుని పురుగుల మందుతాగారు. అపస్మారక స్థితిలో ఉండగా ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందారని ఎస్‌ఐ తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

బాలికను వివస్త్రను చేసి....

ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లా నారాయణపురం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వృద్ధుడిని చేబ్రోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈనెల 24న నారాయణపురం అరుంధతి కాలనీలో పిల్లలు ఆడుకుంటుండగా తొమ్మిదేళ్ల బాలికను డబ్బులిస్తానని చెప్పి గంజికోట గోవిందు అనే వృద్ధుడు తీసుకెళ్లాడు.

బాలికను వివస్త్రను చేస్తుండగా ఒక మహిళ గమనించి గట్టిగా మందలించడంతో అక్కడి నుంచి పారిపోయాడు,. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు గోవిందును అరెస్టుచేసి తాడేపల్లిగూడెం కోర్టుకు పంపామని ఎస్‌ఐ చావా సురేష్‌ తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
lovers commited suicide in East Godavari district of Andhra Pradesh, as their affair was questioned by the villagers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి