బాబుకు షాక్: పాదయాత్రకు బ్రేక్ పడకుండా జగన్ ప్లాన్ ఇదే!

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: నవంబర్ రెండవ తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఎలాంటి ఆటంకాలు లేకుండా పాదయాత్ర సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి శుక్రవారం నాడు సిబిఐ ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హజరును మినహయించాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ కోర్టు మినహయింపు ఇవ్వకపోతే ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో ప్రయాణించి కోర్టుకు హజరయ్యేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.

ఆస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ హైద్రాబాద్ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానానికి హజరుకావాల్సి ఉంటుంది.ప్రతి శుక్రవారం నాడు సిబిఐ కోర్టుకు వ్యక్తిగతంగా హజరుకావాలనే విషయంలో మినహయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు.

ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సుదీర్ఘంగా పాదయాత్ర చేయాలని భావిస్తున్న నేపథ్యంలో నవంబర్ రెండవ తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేయాలని తలపెట్టారు.

నవంబర్ రెండవ తేది నుండి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇడుపులపాయ నుండి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ పాదయాత్ర ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. అయితే ప్రతి శుక్రవారం నాడు సిబిఐ కోర్టుకు జగన్ హజరుకావాల్సి ఉంది. దీంతో పాదయాత్రపై ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో ఉంది. దరిమిలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టింది. పాదయాత్ర ఎలాంటి విఘాతం లేకుండా సాగితే టిడిపికి కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే పాదయాత్ర ప్రతి వారం ఆగితే రాజకీయంగా జగన్‌పై ప్రత్యర్థులు విమర్శలు గుప్పిస్తారు. దీంతో వైసీపీ ప్రత్యామ్నాయాలపై కేంద్రీకరించింది.

ప్రత్యేక విమానంలో కోర్టుకు జగన్‌

ప్రత్యేక విమానంలో కోర్టుకు జగన్‌

ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం నాడు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సిబిఐ కోర్టుకు హజరు కావాల్సి ఉంది. అయితే సిబిఐ కోర్టకు వ్యక్తిగతంగా హజరుకావడం మినహయించాలని కోర్టులో వైఎస్ జగన్ తరపు న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకవేళ కోర్టు జగన్‌కు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే పాదయాత్రను ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగించడంపై వైసీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు.ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు చేరుకొని కోర్టుకు హజరయ్యేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.

2014లో మూడు మాసాలపాటు మినహయింపు

2014లో మూడు మాసాలపాటు మినహయింపు

2014 ఎన్నికల సమయంలో ప్రతి శుక్రవారం నాడు కోర్టుకు హజరయ్యే విషయమై మూడు మాసాల పాటు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు సిబిఐ కోర్టు మినహయింపు ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారం కోసం వైఎస్ జగన్‌కు మినహయింపు ఇచ్చింది. అయితే పాదయాత్ర సందర్భంగా కనీసం ఆరు మాసాల పాటు మినహయింపు ఇవ్వాలని జగన్ తరపు న్యాయవాదులు కోర్టును కోరుతున్నారు. ఒకవేళ కనీసం మూడు మాసాల పాటు మినహయింపు ఇచ్చినా సరిపోతోందనే అభిప్రాయంతో ఉన్నారు. 2014లో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మూడుమాసాల పాటు మినహయింపులు ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కానీ, పాదయాత్ర విషయంలో కోర్టు నిర్ణయం ఏ రకంగా ఉంటుందనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రత్యామ్నాయంపై వైసీపీ దృష్టి

ప్రత్యామ్నాయంపై వైసీపీ దృష్టి

ప్రతి శుక్రవారం నాడు వ్యక్తిగతంగా కోర్టుకు వైఎస్ జగన్ హజరుకావాల్సిందేననే కోర్టు ఆదేశిస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైసీపీ కేంద్రీకరించింది. ప్రత్యేక విమానంలో హైద్రాబాద్‌కు చేరుకొనేలా ప్లాన్ చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలున్నాయి. పుట్టపర్తి సత్యసాయి ఎయిర్‌పోర్ట్, కడప, తిరుపతి, గన్నవరం,రాజమండ్రి, విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌ల ద్వారా ప్రత్యేక విమానాలతో హైద్రాబాద్‌కు శుక్రవారం నాడు చేరుకొనేలా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నారు.

రోడ్డు మార్గంలో కోర్టుకు జగన్

రోడ్డు మార్గంలో కోర్టుకు జగన్

ఎయిర్‌పోర్ట్ సౌకర్యం లేని జిల్లాల్లో పాదయాత్ర కొనసాగుతున్న పరిస్థితి ఉంటే, రోడ్డు మార్గం ద్వారా హైద్రాబాద్‌కు చేరుకొనేలా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కర్నూల్, గుంటూరులోని పల్నాడు ప్రాంతాల నుండి రోడ్డు మార్గం ద్వారా హైద్రాబాద్‌కు చేరుకొనే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.తమ ప్లాన్ అనుకొన్నట్టు సాగితే ఎలాంటి బ్రేక్ లేకుండా పాదయాత్ర సాగే అవకాశం ఉందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress president Y.S. Jagan Mohan Reddy may have to catch a flight to attend the CBI Special Court proceedings every Friday if he does not intend to reschedule his six-month padayatra starting November 2.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి