వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నైకు తాగు నీరివ్వాలని సీఎం జగన్ ఆదేశం : ముఖ్యమంత్రితో తమిళమంత్రుల భేటీ..అభ్యర్దన..!!

|
Google Oneindia TeluguNews

చెన్నైలో తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు మంత్రులు ఏపీ సీఎం జగన్ ను కలిసి
తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని మంత్రులు విఙ్ఞప్తి చేశారు. దీనికి ఏపీ సీఎం వెంటనే స్పందించారు. అసవరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జగన్..
ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

On Request of Tamilanadu Ministers Cm Jagan respond positively ordered supply drinking water for Chennai

చెన్నై ప్రజలకు అండగా ఏపీ ప్రభుత్వం..

చెన్నైలో చాలారోజులుగా తాగునీటి సమస్యతో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దీని కోసం అక్కడ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకుంటోంది. దీని కోసం పొరుగున ఉన్న ప్రభుత్వాల సాయం తీసుకుంటోంది. ఇప్పటికే దూర ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ట్యాంకర్లు..రైలు ట్యాంకుల ద్వారా మంచి నీరు తెప్పిస్తోంది. అయితే, వర్షాకాలం ప్రారంభమైన అక్కడ పరిస్థితి లో మార్పు రాలేదు. దీంతో..ఏపీ ప్రభుత్వం చెన్నై ప్రజల దాహార్తి తీర్చేందుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు మంత్రులు ఏపీ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు మున్సిపల్‌ శాఖా మంత్రి గణేశన్, మత్స్యశాఖ, పాలనా సంస్కరణల శాఖా మంత్రి జయకుమార్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ మనివాసన్‌ సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తాగునీటి కొరతతో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని మంత్రులు విఙ్ఞప్తి చేశారు. తాగడానికి నీళ్లులేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని సీఎం జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో..అక్కడి పరిస్థితి పైన ముఖ్యమంత్రి ఆరా తీసారు. మంచినీటి కొరత ఏర్పడితే ప్రజలు పడే ఇబ్బందులు అర్దం చేసుకోగలమని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

On Request of Tamilanadu Ministers Cm Jagan respond positively ordered supply drinking water for Chennai

సానుకూలంగా స్పందించిన సీఎం జగన్..
చెన్నై ప్రజల గొంతు తడిపి వారి కష్టాలు తీర్చాలని విఙ్ఞప్తి చేసిన తమిళనాడు మంత్రుల బృందం అభ్యర్థన పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. తాగునీటి కోసం లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చెన్నైకి తాగునీటి విడుదలకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరాభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో సీఎం జగన్‌ అన్నారు. ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాలు పంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.తమ అభ్యర్ధన పట్ల ఏపీ సీఎం సానుకూలంగా స్పందించడంతో తమిళనాడు మంత్రుల బృందం ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలిపింది. అడగగానే మానవత్వంతో స్పందించారంటూ మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ అధికారులు తమిళనాడు ప్రభుత్వంతో టచ్ లో ఉంటారని సమన్వయంతో చెన్నైకి మంచినీరు అందించేలా చర్యలు తీసుకుంటమాని ఏపీ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

English summary
On Request of Tamilanadu Ministers AP Cm Jagan respond positively and ordered officer to supply drinking water for Chennai public. As per Tamilanadu CM directions ministers met AP CM Jagan. AP CM Assured shortly water will reach Cheanni from AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X