హెరిటేజ్‌ ఆఫీస్‌లో చోరీకి యత్నం: ఒకరి అరెస్టు

one arrested for trying to resort for theft at Heritage
హైదరాబాద్: హెరిటేజ్‌ సంస్థ కార్యాలయంలో చోరీకి యత్నించిన ఇంటి దొంగను హైదరాబాదులోని ఎల్‌బీనగర్‌ పోలీసులు పట్టుకున్నారు. ఎల్‌బీ నగర్‌లోని చంద్రపురి కాలనీలో హెరిటేజ్‌ సంస్థ కార్యాలయం ఉంది. ఇక్కడి నుంచి వ్యాన్లలో పాలు వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంటారు. పరిసర ప్రాంతాల్లోని ఏజెంట్లు కూడా ఇక్కడే బిల్లులు చెల్లిస్తుంటారు.

హెరిటేజ్‌ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి (19) కొన్నాళ్లుగా పనిచేసి వారం రోజుల క్రితం మానేశాడు. ప్రస్తుతం అల్కాపురిలో గది అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు కార్యాలయం భవన యజమాని వాకింగ్‌ కోసం నిద్ర లేవగా.. హెరిటేజ్‌ కార్యాలయంలో శబ్దం వినిపించింది. అక్కడికి వెళ్లగా ఐదారుమంది కన్పించారు.

ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించగా, కార్యాలయాన్ని ఖాళీ చేసి ఉప్పల్‌కు తరలిస్తున్నామని చెప్పారు. అప్పటికే శ్రీనివాస్‌రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయాడు. తనకు తెలియకుండా కార్యాలయం ఖాళీ చేయటమేమిటని భావించిన ఇంటి యజమాని హెరిటేజ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజుకు ఫోన్‌ చేసి ప్రశ్నించాడు. కార్యాలయం ఖాళీ చేయటం లేదని చెప్పిన రాజు విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

పోలీసులు అక్కడకు వెళ్లి శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మారు తాళాలతో శ్రీనివాస్‌రెడ్డి షట్టర్‌ తీసినట్టు పోలీసులు వెల్లడించారు. కార్యాలయంలోని రూ.15 లక్షల నగదు ఉన్న బీరువా కన్పించలేదని ఎల్‌బీనగర్‌ పోలీసులకు అసిస్టెంట్‌ మేనేజర్‌ రాజు ఫిర్యాదు చేశాడు.

సదరు నగదు ఉన్న బీరువాను ఎత్తుకెళ్లే ప్రయత్నంలో పోలీసులు పట్టుకొని నగదు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ వి షయాన్ని పోలీసులు అధికారికంగా ధ్రువీకరించటం లేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+