నిన్న కేశినేని, నేడు కాళేశ్వరి: ఒకరు మృతి
అమరావతి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వల్ల రోడ్డు ప్రమాదాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. నిన్న కేశినేని ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డ ఘటనక మరువకముందే, నేడు కాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది.
ఈ తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ప్రకాశం జిల్లా కొమురోలు మండలం కత్తెరవానిపల్లె సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. విజయవాడ నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో పదిమందికి పైగా గాయపడ్డారు. వీరిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారంతా కడప జిల్లా వాసులుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications