ఆర్టీసీ బస్సులో కిలో బంగారం: చెన్నై నుంచి ఏపీలోకి.. చివరకు ఏమైందంటే.?

అమరావతి: ఆర్టీసీ బస్సులో కిలో బంగరాం దొరికిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో చెన్నై నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో కిలో బంగారాన్ని ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత విజయవాడలోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. జగ్గయ్యపేటకు చెందిన బంగారం వ్యాపారి శేఖర్ తన గుమస్తాలు పవన్, రాజేష్‌లను బంగారు కొనుగోలు కోసం చెన్నై పంపారు. కిలో బంగారం కొన్న ఇద్దరు నెల్లూరు వరకు వచ్చి అక్కడ సాయంత్రం విశాఖపట్నం వెళ్లే బస్సు ఎక్కారు.

One kg gold seized in rtc bus in ongole

అనంతరం ఒంగోలు బస్టాండ్ చేరుకున్నారు. కాగా, ఆ బస్సులోకి ఐడీ పార్టీ కానిస్టేబుళ్లమంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి బంగారం తెస్తున్న వారిని వెంట తీసుకెళ్లారు. ఈ క్రమంలో బంగారం తెచ్చేవారు సెల్‌ఫోన్లు ఉపయోగించలేకపోయారు.

ఇక బంగారం వ్యాపారి శేఖర్.. బస్సు డ్రైవర్‌కు ఫోన్ చేయగా.. ఒంగోలు డిపోలు ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి బంగారం తెచ్చేవారిని వెంటబెట్టుకుని పోయారని తెలిపారు. దీంతో వెంటనే శేఖర్ వాట్సాప్ ద్వారా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

వెంటనే స్పందించిన స్పందించిన పోలీసులు బిల్లులు లేకుండా అక్రమ బంగారు కొనుగోళ్లపై దర్యాప్తు చేస్తున్న డీఆర్ఐ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారని గుర్తించారు. చెన్నై నుంచి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన బంగారాన్ని తరలిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు డీఆర్ఐ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బిల్లులు లేకుండా బంగారం లావాదేవీలు నడుపుతున్న వ్యవహారంపై డీఆర్ఐ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+