ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ ఎంపీ -వారసుడిని వెంటాడుతున్న ఢిల్లీ స్కాం - ఎన్నికల్లో పోటీపై ఎఫెక్ట్..!?

|
Google Oneindia TeluguNews

వైసీపీ ఎంపీ వచ్చే ఎన్నికల్లో తమ కుమారుడి రాజకీయ ఎంట్రీకి రంగం సిద్దం చేసుకున్నారు. ఇదే సమయంలో ఆ ఎంపీతో పాటుగా ఆయన కుమారుడిని ఢిల్లీ స్కాం వెంటాడుతోంది. తమకు సంబంధం లేదని చెబుతున్నా..ప్రతీ ఛార్జ్ షీట్ లో వీరి పేర్లు కనిపిస్తున్నాయి. ఒంగోలు ఎంపీ మగుంట శ్రీనివాసులు రెడ్డి..ఆయన కుమారుడు రాఘవ్ పేర్లు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రతీ సందర్భంలోనూ వినిపిస్తున్నాయి. వీటి పైన ఎంపీ మాగుంట పలు మార్లు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా మరోసారి ఈడీ వారి పేర్లను ప్రస్తావించింది. ఇది రాజకీయంగా వారికి ఇబ్బందిగా మారుతోంది.

లిక్కర్ స్కాంలో ఎంపీ - తనయుడు పేర్లపై

లిక్కర్ స్కాంలో ఎంపీ - తనయుడు పేర్లపై

ఢిల్లీ లిక్కర్ స్కాం లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని కొందరు పేర్లు నిత్యం తెర పైకి వస్తు్నాయి. తాజాగా సమీర్ మహీంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవితతో పాటుగా ఎంపీ మాగుంట, మరి కొందరి పేర్లను ప్రస్తావించింది. ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన సమయంలో.. కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, ఆడిటర్‌ బుచ్చిబాబు, పెర్నార్డ్‌ రికార్డ్‌కు చెందిన బినయ్‌ బాబు పలుమార్లు ఆప్‌ నేతలతో భేటీ అయ్యారని, హోల్‌సేల్‌, రిటైల్‌ ఉత్పత్తిదారులతో కుమ్మక్కై కార్టెల్‌(సిండికేట్‌)ను ఏర్పాటు చేశారని స్పష్టం చేసింది. కవిత, మాగుంట రాఘవ్‌, శరత్‌రెడ్డి నిర్వహిస్తున్న సౌత్‌గ్రూ్‌ప.. ఈ కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిందని దినేశ్‌ అరోరా వాంగ్మూలాన్ని ప్రస్తావించింది.
మాగుంట కుమారుడు వారితో కలిసి..

మాగుంట కుమారుడు వారితో కలిసి..


మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ్‌ మాగుంటకు చెందిన జైనాబ్‌ ట్రైడింగ్‌, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు చెల్లించారు. మాగుంట ఆగ్రోఫామ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట రాఘవ్‌కు రెండు రిటైల్‌ జోన్లు ఉన్నాయని ఛార్జ్ షీట్ లో వివరించింది. సమీర్‌ మహేంద్రు ఢిల్లీలోని మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో 2-3సార్లు సమావేశమయ్యారు. శ్రీనివాసులు రెడ్డితోపాటు ఆయన కుమారుడు రాఘవ్‌, బుచ్చిబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని ఈడీ పేర్కొంది. ఇండో స్పిరిట్‌ వ్యాపార వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రయోజనాలకు ప్రేమ్‌రాహుల్‌ మండూరి ప్రాతినిధ్యం వహించారని నివేదించింది.

రాజకీయంగా ఎఫెక్ట్ పడేనా..

రాజకీయంగా ఎఫెక్ట్ పడేనా..


ఇప్పటికే లిక్కర్ స్కాంలో వస్తున్న ఆరోపణలను వైసీపీ ఎంపీ మాగుంట ఖండిస్తూ వచ్చారు. అసలు ఈ లిక్కర్ స్కాంలో తనకు...తన కుమారుడికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఇదంతా ఉత్తరాది వ్యాపారుల కుట్రగా అభివర్ణించారు. తాము 70 ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని..ఎప్పుడు అక్రమాలు చేయలేదని మాగుంట స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు పోటీ చేస్తారని ఇప్పటికే ఎంపీ మాగుంట ప్రకటించారు. ఇందు కోసం మాగుంట కుమారుడు ఒంగోలు కేంద్రంగా రాజకీయంగా బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ..ఇప్పుడు లిక్కర్ స్కారం ఎంపీ మాగుంట - ఆయన కుమారిడిపైన ఆరోపణలకు కారణమవుతోంది. జాతీయ స్థాయిలో ఢిల్లీ లిక్కర్ స్కారం ప్రకంపనలకు కారణమవుతున్న సమయంలో..మరో ఏడాదిలో జరగున్న ఎన్నికల్లో మాగుంట - ఆయన కుమారుడిని ఈ వివాదం సమస్యగా మారుతుందా అనేది చర్చకు కారణమవుతోంది. ఇదే సమయంలో మాగుంట వైసీపీ నుంచే పోటీ చేస్తారా..లేక రాజకీయంగా వేరే ఆలోచనతో ఉన్నారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

English summary
Ongole MP Magunta and his son name mentioned by ED in Delhi liquor scam Charges sheet, It leads to new discussion in next coming Elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X