తెలంగాణలో మనోళ్లున్నారనే-కేసీఆర్ సర్కార్ పై జగన్ అసహనం-కేబినెట్లో కీలక వ్యాఖ్యలు

ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల ప్రాజెక్టు వివాదాలు ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలోనూ ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందకర్భఁగా సీఎం జగన్ మంత్రులతో చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలంగాణ మంత్రుల తీవ్ర వ్యాఖ్యలపై సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దూకుడుగా మందుకు వెళ్లాలని నిర్ణయించారు.

ఏపీలో నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ పై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తిపై జగన్ సర్కార్ కౌంటర్ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ అంశంపై వాడివేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మంత్రులు వాడుతున్న భాష, అభ్యంతరాలపై ఏపీ కేబినెట్లో సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నట్లు జగన్ తెలిపారు. మన వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు.

only concern about andhra people in telangana, says jagan amid water dispute with neighbourhood state

తెలంగాణ అభ్యంతరాలతో ఏపీలో రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకోవాలంటూ మంత్రుల్ని జగన్ ప్రశ్నించారు. జల వివాదాలపై ఏ విధంగా పోరాడాలో ఆలోచించాలని మంత్రులకు జగన్ సూచించారు. ముఖ్యంగా శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి విషయంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మరోసారి లేఖ రాయాలని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. శ్రీశైలంలో అనుమతి లేకుండా నీటి వినియోగంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయించింది.
దీంతో జల వివాదాలపై కేంద్రం వద్దే తెల్చుకోవాలని భావిస్తున్నట్లు అర్ధమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+