జగన్ విన్నింగ్ "గేమ్" అర్దం కావాలంటే కనీసం ఎమ్మెల్యే అవ్వాలి..!!
ఏపీలో జగన్ కొత్త గేమ్ ప్రారంభించారు. ఊహించని సంఖ్యలో ఇంఛార్జ్ లను మారుస్తున్నారు. తమ పొత్తుల లెక్కలు..జగన్ అభ్యర్దుల మార్పు తమకు కలిసి వస్తుందని చంద్రబాబు అండ్ కో అంచనా వేస్తోంది. షర్మిల ఏపీలో కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఇక జగన్ ఓటమి ఖాయమనే లెక్కలతో ధీమాగా ఉంది. కానీ, అసలు జగన్ లెక్కే వేరు. ప్రతిపక్షాల మైండ్ గేమ్ ప్రస్తుతానికి ఆధిపత్యం సాగిస్తున్నా..జగన్ నిర్ణయాల వెనుక విన్నింగ్ ఫార్ములా ఉందనేది వైసీపీ నేతల విశ్లేషణ.
జగన్ కొత్త వ్యూహాలు
ఏపీలో జగన్ కు ఈ సారి గెలుపు తన రాజకీయ భవిష్యత్ కు చాలా కీలకం. ప్రతీ సీటు..ప్రతీ ఓటు ఎక్కడా జారకుండా చూసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. జగన్ లెక్కలు అంత సులభంగా ఎవరికీ అంతు చిక్కవు. ఈ లెక్కల వెనుక అసలు విషయం ఏంటో తెలుసుకున్న చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారు.

పైకి జగన్ పని అయిపోయిందని..ఓటమి ఖాయమని చెబుతూనే..జగన్ ను ఓడించేందుకు అందరినీ కూడగడుతున్నారు. అక్కడే జగన్ బలం ఏంటో చెప్పకనే చెబుతున్నారు. జగన్ ఎన్నికల కోసం సెప్టెంబర్ నుంచే కసరత్తు ప్రారంభించారు. ఎన్నికలకు సిద్దం కావాల్సిన సమయంలో ప్రతిపక్షాలు పూర్తిగా అనుకూల ప్రచారంతో సంబరపడుతున్నాయి.
ప్రతిపక్షాల మైండ్ గేమ్
చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీలో దాదాపు మూడు నెలలు ఎన్నికల దిశగా ఎటువంటి కార్యాచరణ లేదు. ప్రస్తుతం దాదాపు 20 రోజులుగా జగన్ చేస్తున్న అభ్యర్దుల మార్పు గురించి పైన ఫోకస్ చేసిన టీడీపీ ఆ అంశం పైనే ఎక్కువగా స్పందిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కు 40 రోజులు మాత్రమే సమయం ఉంది. పొత్తుల్లో భాగంగా సీట్ల వ్యవహారం అంత సులభంగా తేలే అంశం కాదు. జగన్ తన అభ్యర్దుల ఖరారు మరో 10 రోజులు కొనసాగించే అవకాశం ఉంది. జగన్ లెక్కలు తేలితేనే టీడీపీ, జనసేన మధ్య సీట్లు..అభ్యర్దుల అంశం తేలేది. జగన్ బీసీ, ఎస్సీలకు ప్రాధాన్యత ఇస్తున్న సమయంలో టీడీపీ, జనసేన కు మద్దతుగా నిలిచే రెండు ప్రధాన వర్గాలను కాదని జగన్ తరహాలో బీసీ, ఎస్సీలకు సీట్లు కేటాయించే పరిస్థితి ఆ రెండు పార్టీలకు లేదనే అభిప్రాయం ఉంది.
జగన్ విన్నింగ్ ఫార్ములా
ఇక, జగన్ తరహాలో తాము సంక్షేమం అమలు చేస్తామని ఆ రెండు పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. జగన్ ఇప్పుడు అమలు చేస్తున్న వాటితో పాటుగా కొత్త పథకాలు ఈ టర్మ్ లోనే ప్రకటన..వీలైతే అమలు ప్రారంభించాలని కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు నెలల కాలంలో కోటి పది లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలతో భారీగా నిధులను జమ చేయనున్నారు. ఉద్యోగులకు ఐఆర్ తో పాటుగా డీఎస్సీ ప్రకటనకు సిద్దం అవుతున్నారు.
అటు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ఓటింగ్ శాతం పెరిగితే అది జగన్ వ్యతిరేక ఓటు చీలి..టీడీపీ, జనసేన ఆశలకు నష్టం చేయటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. వైసీపీ ఇప్పటి కీ తమకు 57 శాతం అనుకూల ఓటింగ్ ఉందని చెబుతోంది. ప్రతిపక్షాలను తన వైపే చూసేలా చేస్తూ..వాళ్లు ఎన్నికల దిశగా అడుగులు వేయలేని పరిస్థితి కల్పిస్తూ...తాను ఎన్నికల రంగంలోకి దిగుతూ.. ప్రజలను తన వైపు తిప్పుకుంటూ..సంక్షేమం - సామాజిక న్యాయంతో గెలవటమే జగన్ విన్నింగ్ ఫార్ములాగా పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.












Click it and Unblock the Notifications