జగనన్న ఇళ్ల నిర్మాణనంలో విజిలెన్స్ ఎంట్రీతో గడబిడ
గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇదే సమయంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో జరిగిన స్కాంపై పూర్తి సమాచారం బయటకు లాగడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు విశాఖలో ఆప్షన్ 3 కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణ అక్రమాలపై విచారణకు ఆదేశించింది.
గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో కొందరు కాంట్రాక్టర్లు పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం నుండి కాంట్రాక్ట్ తీసుకున్నారు. పలు సంస్థలు పేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా చిన్నాచితక కాంట్రాక్టు సంస్థలకు పేదలకు ఇల్లు నిర్మించే పనులు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి.

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ నిధులను భారీ మొత్తంలో దుర్వినియోగం చేశారని, వీటి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఒకే వ్యక్తి ఫ్యామిలీకి చెందిన మూడు కంపెనీలు 69 వేలకు పైగా గృహాలు నిర్మిస్తున్నాయి.
ఈ కంపెనీలు పేరుకు మాత్రమే మూడు కంపెనీల అయినా అది ఒకే వ్యక్తికి సంబంధించిన కంపెనీలని, ఒకే వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో ఈ కంపెనీలు ఏర్పాటు చేశారని విజిలెన్స్ విచారణ అధికారంలో వెలుగు చూసింది. విశాఖ జిల్లాలోని సుమారు 34 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. విశాఖ జిల్లాలలోనే ఎక్కువగా ఈ సంస్థ పేదలకు ఇల్లు నిర్మిస్తామని కాంట్రాక్టులు తీసుకున్నారని వెలుగు చూసింది.

వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆశీస్సులతో ఈ కంపెనీలకు పుష్కలంగా నిధులు విడుదల అయ్యాయని, ఆ విధులకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇళ్ల నిర్మాణం ఎత వరకు వచ్చింది అంటూ విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. పేదలకు ఇళ్లు నిర్మిస్తామని ఇసుక, సిమెంటు, కాంక్రీట్, ఐరన్ బయట అమ్మేశారని విజిలెన్స్ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications