Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OSCAR 2023: 'ఆర్ఆర్ఆర్' నాటు నాటు నామినేట్: చంద్రబాబు ట్వీట్; జూనియర్ ఎన్టీఆర్‌పై రచ్చ!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనాలు సృష్టించి, దేశ విదేశాలలోనూ అంతే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంటూ దూకుడును కొనసాగిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ నామినేషన్ లో కూడా ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డుకి నామినేట్ అయింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు పాట ఈ అవార్డుకు నామినేట్ అయినట్టు ఆస్కార్ అవార్డుల అకాడమీ ప్రకటించింది.

నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావటంపై చంద్రబాబు ట్వీట్

నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ కావటంపై చంద్రబాబు ట్వీట్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన పిరియాడికల్ మూవీ ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట సినిమా థియేటర్లలోనే కాదు, ఎక్కడికి వెళ్లినా రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల జాబితాలో అధికారికంగా నామినేట్ అయి తన సత్తా చాటింది. ఆస్కార్ అవార్డును పొందడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇక ఆస్కార్ కు నామినేట్ కావడంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రశంసలు వెల్లువగా మారాయి. ఎంతో మంది ప్రముఖులు ట్వీట్ చేసినా చంద్రబాబు ట్వీట్ పై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.

జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్ పెట్టిన చంద్రబాబు

జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి మరీ పోస్ట్ పెట్టిన చంద్రబాబు


తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆర్ఆర్ఆర్ సినిమా నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో రావడంతో సోషల్ మీడియా వేదికగా ట్విట్ చేశారు. సినిమా క్రూ కు ఆయన అభినందనలు తెలియజేశారు. తను పెట్టిన పోస్టులో ఈ పాటకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిని, సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని, పాటకు లిరిక్స్ రాసిన చంద్రబోస్ ను, జూనియర్ ఎన్టీఆర్ ను, రామ్ చరణ్ ను తన పోస్టులో ట్యాగ్ చేసి ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాణం కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు . నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ పాటగా నామినేట్ కావడంతో చంద్రబాబు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చెయ్యకుండా

గతంలో జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చెయ్యకుండా

చంద్రబాబు పోస్ట్.. అయినా ఎన్టీఆర్ రిప్లై
అయితే చంద్రబాబు తాజాగా పెట్టిన పోస్ట్ పై కూడా సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతుంది. గతంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు నాటు నాటు పాటకు వచ్చిన సమయంలో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేయకపోవడంతో సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై విమర్శలు వెల్లువగా మారాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వచ్చిన సమయంలో అభినందనలు తెలియజేసిన చంద్రబాబు ఎం ఎం కీరవాణిని, దర్శకుడు యస్ యస్ రాజమౌళిని మాత్రమే ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అయినప్పటికీ ఆ పోస్టుకు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ థాంక్యూ సో మచ్ మామయ్య అంటూ రిప్లై ఇచ్చారు.

 ఇప్పుడు ట్యాగ్ చేసిన చంద్రబాబు.. నెటిజన్లు ఏమంటున్నారంటే

ఇప్పుడు ట్యాగ్ చేసిన చంద్రబాబు.. నెటిజన్లు ఏమంటున్నారంటే


అప్పుడు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేయలేదని నెటిజన్లు రచ్చ చేశారు. ఇక తాజాగా ఆస్కార్ కు నామినేట్ కావడంతో చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టారు. దీంతో గతంలో చేసిన తప్పును చంద్రబాబు దిద్దుకున్నారని కొందరు, గతంలో విమర్శలు రావడం వల్లే చంద్రబాబు తారక్ ను ట్యాగ్ చేశారని మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసినా , చెయ్యకపోయినా సోషల్ మీడియాలో రచ్చ ఫిక్స్ అంటూ తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+