వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా ఇళ్ళు మళ్ళీ మాకే ఇచ్చేదేంటయ్యా... ఓటీఎస్ స్కీమ్ పై జనాగ్రహం, అసలు జరుగుతుందిదే!!

|
Google Oneindia TeluguNews

జగనన్న గృహ హక్కు పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ప్రజలకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ అప్పుల తిప్పల నుండి తప్పించుకోవడానికి రోజుకో రకమైన కొత్త వసూళ్లకు జగన్ సర్కార్ తెరతీస్తున్నదన్న టాక్ ఏపీలో ప్రస్తుతం వినిపిస్తుంది. గతంలో ప్రభుత్వ హౌసింగ్ పథకం ద్వారా ఇల్లు నిర్మించుకున్న వాళ్లు 10 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ప్రభుత్వం వాలంటీర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇక వాలంటీర్లు జనాల వద్ద నుండి డబ్బులు వసూలు చేయడానికి రంగంలోకి దిగారు. అయితే బలవంతం పెడుతున్నారని ప్రజలు వాపోతుంటే, అలాంటిదేమీ లేదని స్వచ్చందంగా ఇచ్చేవారికే రిజిస్ట్రేషన్ లు చేయిస్తామని సర్కార్ చెప్తోంది.

ఎవరి మీదా ఒత్తిడి లేదంటున్న జగన్ సర్కార్

ఎవరి మీదా ఒత్తిడి లేదంటున్న జగన్ సర్కార్

ఓటీఎస్ స్కీం విషయంలో ప్రభుత్వం తాము ఎవరి మీదా ఒత్తిడి తీసుకురావటం లేదని చెప్తుంది. అంతే కాదు పేదలకు ప్రయోజనం కలిగించడం కోసం వన్ టైమ్ సెటిల్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టామని జగన్ సర్కార్ వెల్లడిస్తోంది. ఎవరిపై ఎలాంటి బలవంతం లేదని తేల్చి చెప్తుంది . జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పై దుష్ప్రచారం జరుగుతోందని ఈ దుష్ప్రచారం పై కఠినంగా వ్యవహరించాలని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఈ స్కీమ్ పై దుష్ప్రచారం చేస్తోందని జగన్ సర్కారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.

 క్షేత్ర స్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారంటే

క్షేత్ర స్థాయిలో అధికారులు ఏం చేస్తున్నారంటే


క్షేత్రస్థాయిలో అధికారులకు ఈ స్కీం విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల, వారు లబ్ధిదారులకు చెబుతున్న విధానం లబ్ధిదారులను గందరగోళానికి గురి చేస్తుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన స్కీం వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించాల్సిన అధికారులు అలా కాకుండా 10000 కట్టాల్సిందే, 15000 కట్టాల్సిందే అంటూ వారిపై ఒత్తిడి తీసుకురావడంతో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. లబ్ధిదారుల దగ్గరకు వెళ్ళిన అధికారులు వారికి సంబంధించిన లోన్ వివరాలు సమగ్రంగా చెప్పి, ఆ లోన్ కి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న బెనిఫిట్స్ వివరించి, వన్ టెన్ సెటిల్మెంట్ స్కీమ్ లో చెల్లించేందుకు ఒప్పించాల్సి ఉండగా, ఆ డీటెయిల్స్ ఏమి చెప్పకుండా, అప్పుడెప్పుడో మీరు ఇల్లు కట్టుకోవడానికి లోన్ తీసుకున్నారు. ఆ లోన్ ఇప్పుడు చెల్లించాలని చెప్పడం లబ్ధిదారులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

ఉమ్మడి ఏపీలో తీసుకున్న లోన్స్ ఇప్పుడు ఎందుకు చెల్లించాలని ప్రశ్న

ఉమ్మడి ఏపీలో తీసుకున్న లోన్స్ ఇప్పుడు ఎందుకు చెల్లించాలని ప్రశ్న

జగన్ సర్కార్ ఓటీఎస్ స్కీం పై చాలా మంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్న హౌసింగ్ లోన్ లు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మా పేరు మీద ఉన్న ఇంటికి మళ్ళీ మాకే రిజిస్ట్రేషన్ చేయడమేమిటని నిలదీస్తున్నారు. సొంత డబ్బుతో స్థలం కొనుక్కుని, ఇల్లు కట్టుకున్న వారికి సైతం నోటీసులు పంపి గతంలో గృహనిర్మాణ సంస్థ ద్వారా తీసుకున్న డబ్బులు చెల్లించాలని, అప్పుడే మీకు జగనన్న సంపూర్ణ గృహ పథకం కింద ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పడంతో, సొంత స్థలం, సొంత ఇల్లు మళ్లీ మా పేరు మీద రిజిస్ట్రేషన్ ఏంటి అని జనాలు అవాక్కవుతున్నారు.

పాత ఇళ్ళకు కొత్తగా పైసా వసూల్ అంటూ ఆగ్రహం

పాత ఇళ్ళకు కొత్తగా పైసా వసూల్ అంటూ ఆగ్రహం


అప్పుడెప్పుడో ఇచ్చిన పాత ఇళ్లకు కొత్తగా పైసా వసూల్ చేస్తున్న ప్రభుత్వం అంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ డబ్బులు చెల్లించకపోతే పెన్షన్ కు కోత పెడతామని హెచ్చరికలు జారీ చేస్తోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో ప్రజలు లబోదిబోమంటున్నారు. గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు, గతంలో కట్టుకున్న ఇల్లు... కొందరైతే సొంత స్థలంలోనే ప్రభుత్వ సహకారంతో నిర్మించుకున్న గృహాలలో ఉన్నదాంట్లో జీవనం సాగిస్తుంటే, ఒక్కసారిగా జగన్ సర్కార్ ఓటిఎస్ పేరుతో పిడుగు వేయడం సామాన్యులకు ఏమాత్రం రుచించడం లేదు.

ఇళ్ళు కూడా అమ్మేసుకున్న కొందరు .. అయినా సరే వదలకుండా ఓటీఎస్ వేధింపులు

ఇళ్ళు కూడా అమ్మేసుకున్న కొందరు .. అయినా సరే వదలకుండా ఓటీఎస్ వేధింపులు

ఇల్లు కట్టుకున్న కొంతమంది, ఆ ఇళ్లను అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇల్లు లేక అద్దెకు ఉంటున్న వారిని సైతం ఓటిఎస్ పేరుతో డబ్బులు కట్టాల్సిందే అంటూ ఇబ్బంది పెట్టడం ప్రజలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ కాలం నుండి బడుగు బలహీనవర్గాలకు కేటాయించిన పేదల ఇళ్లపై జగన్ సర్కార్ దండయాత్ర చేస్తోందన్న భావన ప్రజల్లో వ్యక్తమౌతుంది. కొందరైతే నా ఇల్లే మళ్లీ నాకు రిజిస్ట్రేషన్ చేయడమేమిటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నా భార్యను మళ్లీ నాకే ఇచ్చి పెళ్లి చేస్తారా అని జగన్ సర్కారు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఓటీఎస్ కట్టొద్దు అంటున్న చంద్రబాబు, అది జగన్ టోకరా సెటిల్మెంట్ అంటూ టీడీపీ ఆగ్రహం

ఓటీఎస్ కట్టొద్దు అంటున్న చంద్రబాబు, అది జగన్ టోకరా సెటిల్మెంట్ అంటూ టీడీపీ ఆగ్రహం


ఇంటికి వచ్చిన వాలంటీర్ల పై మండి పడుతున్నారు. ఇక వాలంటీర్లు తమ పాత్ర ఏమీ లేదని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము వచ్చామని చెబుతున్నారు. అసలే కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకు ఆర్థిక ఇబ్బందుల నుండి ఇంకా కోల్పోతుంటే ఇప్పుడు కొత్తగా రోజుకొక విధానం తీసుకువచ్చి జగన్ సర్కార్ వసూళ్లకు పాల్పడుతున్నదని అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే ఎవరూ ఓటిఎస్ కట్టవద్దని టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గృహాలు అన్నింటినీ ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని వెల్లడించారు . అది ఓ టి ఎస్ కాదని అది జెటిఎస్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జగన్ టోకరా సెటిల్మెంట్ అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ కట్టొద్దు అని చెప్తున్నారు.

జగన్ సర్కార్ ఓటీఎస్ స్కీమ్ దెబ్బకు అభద్రతా భావంలో ప్రజలు

జగన్ సర్కార్ ఓటీఎస్ స్కీమ్ దెబ్బకు అభద్రతా భావంలో ప్రజలు

సొంతంగా నిర్మించుకున్న ఇళ్లకు, అదేదో ప్రభుత్వం ఇచ్చినట్టు, వాటికి మళ్లీ హక్కులు కల్పిస్తున్నట్లు మళ్లీ రిజిస్ట్రేషన్ చేయిస్తామని, అప్పటి వవరకు వారికి ఎలాంటి హక్కులు లేవని చెప్పటం ఏమిటని విరుచుకుపడుతున్న జనాలు, జగన్ సర్కార్ తీరుతో పూర్తిగా అభద్రతా భావంలో మునిగిపోయారు. జగనన్న గృహ హక్కు హక్కు పథకం అంటూ అదేదో జనాలకు లబ్ది చేకూర్చే పథకం అని చేస్తున్న ప్రచారంపై నిప్పులు చెరుగుతున్నారు.

English summary
One time settlement row continues in Andhra Pradesh. While the Jagan govt is outraged on tdp propaganda on OTS, the TDP criticizes the govt for opening up to exploitation with the OTS. public outraged as to why our houses are registering us again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X