వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్ ... రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు .. చివరకి ఏం జరిగిందంటే !!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. సకాలంలో ఆక్సిజన్ అందించటం కోసం కూడా ఏపీ అధికార యంత్రాంగం తీవ్రంగా దృష్టిసారించింది. తాజాగా జరిగిన ఓ ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది.

విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్

విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రికి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ మిస్సింగ్

విజయవాడ జిజిహెచ్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ మీద 400 మంది కోవిడ్ బాధితులు ఉన్నారు.ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు నిండుకుంటున్న పరిస్థితులలో వారందరికీ ప్రాణవాయువు అవసరం ఉంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలపై దృష్టి సారిస్తున్న జగన్ సర్కార్ తిరిగి ఆక్సిజన్ ట్యాంకర్ల ద్వారా ఆస్పత్రులకు కావాల్సిన ఆక్సిజన్ సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది.ఈ క్రమంలో విజయవాడ జిజిహెచ్ ఆసుపత్రికి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలను కోల్పోవడం, ఏపీ పోలీసులకు ఒక్కసారే షాక్ ఇచ్చింది.

అలెర్ట్ అయిన పోలీసులు, వాహనం కోసం గాలింపు

అలెర్ట్ అయిన పోలీసులు, వాహనం కోసం గాలింపు

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు విజయవాడ సిటీ కమిషనర్ కు సమాచారాన్ని అందించి హుటాహుటిన రంగంలోకి దిగారు.18 టన్నులతో వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ అర్ధరాత్రి తరువాత ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలను కోల్పోవడంతో ఒరిస్సా నుండి విజయవాడకు మధ్య ఉన్న అన్ని మార్గాలలోనూ జిల్లా ఎస్పీ లను అలర్ట్ చేసి వాహనం కోసం గాలింపు మొదలుపెట్టారు. చివరకు వాహనం తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం వద్ద పత్తిపాడు పోలీసులు గుర్తించారు.

అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నానని వాహనాన్ని నిలిపిన డ్రైవర్

అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నానని వాహనాన్ని నిలిపిన డ్రైవర్

అయితే వాహనం డ్రైవర్ నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేయడంతో, అలసి పోవడం వల్ల వాహనాన్ని నిలిపివేసినట్లుగా గుర్తించారు.పోలీసులను చూసి షాక్ తిన్న డ్రైవర్ అదే విషయాన్ని వారికి వివరించారు. ధర్మవరం వద్ద ఆక్సిజన్ ట్యాంకర్ ను ఆపిన డ్రైవర్ అక్కడ ఒక దాబాలో ఆగి విశ్రాంతి తీసుకుంటున్నట్టు గుర్తించిన పోలీసులు, డ్రైవర్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్ కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు.

గ్రీన్ ఛానల్ ఏర్పాటు, డ్రైవర్ కు తోడుగా హోం గార్డ్, సమయానికి ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా

గ్రీన్ ఛానల్ ఏర్పాటు, డ్రైవర్ కు తోడుగా హోం గార్డ్, సమయానికి ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా

డ్రైవర్ కి తోడుగా అనుభవం హోంగార్డు ను ఆక్సిడెంట్ ట్యాంకర్ తో పాటుగా విజయవాడ జీజీహెచ్ ఆసుపత్రికి పంపించారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 400మంది ప్రాణాలు కాపాడినట్టయ్యింది. ఇక ఆక్సిజన్ ట్యాంకర్ ను కనిపెట్టడంలో,ప్రజల ప్రాణాల రక్షణ కోసం సకాలంలో ఆక్సిజన్ ను ఆసుపత్రికి చేర్చడంలో కీలక పాత్ర పోషించిన పోలీసులను డిజిపి గౌతమ్ సవాంగ్ మనస్ఫూర్తిగా అభినందించారు.

English summary
Losing contact with the oxygen tanker tracking system coming to Vijayawada GGH Hospital shock to the AP police.Police immediately alerted the Vijayawada City Commissioner and rushed to the scene. The driver was tired and stopped the vehicle at Dharmavaram. The oxygen tanker was rushed to Vijayawada GGH Hospital on time by the AP police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X