చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు జిల్లాలో జగన్‌కు తొలి షాక్: టీడీపీలోకి అమర్నాథ్, అదే అసంతృప్తి?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో వికెట్ పడనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పంతొమ్మిది మంది వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.

ఇప్పటి దాకా కర్నూలు, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప, అనంతపురం తదితర జిల్లాల నుంచి వైసిపి నుంచి టిడిపిలో చేరారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎవరూ చేరలేదు. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా నుంచి కూడా వైసిపి ఎమ్మెల్యే ఒకరు సైకిల్ ఎక్కనున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. కృష్ణా జిల్లా జిల్లా నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ఈ విషయాన్ని చెప్పడం గమనార్హం.

Palamaner MLA N Amaranath Reddy may join TDP

వైసిపి నేతలు, జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శిస్తున్నప్పుడల్లా వైసిపి నుంచి ఒక వికెట్ పడుతోందని చెప్పారు. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరేందురు రంగం సిద్ధం చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అమర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరితే.. చిత్తూరు జిల్లా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యేల్లో ఈయన తొలివారు అవుతారు.

చిత్తూరు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి పైన వైసిపియే పైచేయి సాధించింది. చంద్రబాబు సొంత జిల్లాలో జగన్ పార్టీ పైచేయి సాధించడం చర్చనీయాంశమైంది. ఎన్నికల అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ అన్ని జిల్లాల్లో పని చేసినా చిత్తూరు జిల్లాలో పెద్దగా పని చేయలేదు. ఇప్పుడు అమర్నాథ్ రెడ్డి చేరిక ద్వారా తొలి వికెట్ జిల్లాలో పడనుంది.

అసలు, ఆపరేషన్ ఆకర్ష్‌లో మొదటి నుంచి వినిపిస్తున్న పేరు అమర్నాథ్ రెడ్డి. పీఏసీ చైర్మన్ పదవి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇవ్వడంపై ఈయన కూడా అసంతృప్తిగానే ఉన్నారని తెలుస్తోంది.

భూమా నాగిరెడ్డి వెళ్లిపోయిన తర్వాత... పీఏసీ పదవిని తనలాంటి సీనియర్ నేతలకు ఇవ్వాలని జగన్‌కు అమర్నాథ్ పలుమార్లు చెప్పారని, కానీ బుగ్గనకే కేటాయించడంపై మనస్తాపం చెందారని తెలుస్తోంది. దీంతో ఆయన కూడా టిడిపిలో చేరవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రోజా పేరు కూడా వినిపిస్తోంది. అయితే, ఆమె చేరిక విషయమై అవి కేవలం ఊహాగానాలే అని అంటున్నారు.

ఇప్పటి దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి ఎవరూ వైసిపి నుంచి టిడిపిలో చేరలేదు. ఇప్పుడు చంద్రబాబు సొంత జిల్లా నుంచి కూడా వైసిపి ఎమ్మెల్యే ఒకరు సైకిల్ ఎక్కనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పలమనేరు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన పలమనేరు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి టిడిపిలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి.

English summary
It is said that the Palamaner MLA N Amaranath Reddy may join Telugudesam Party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X