తిరుమల ప్రసాదంలో వాడే పలాస జీడిపప్పుకు జాతీయస్థాయిలో అరుదైన గుర్తింపు

శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పుకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. తిరుమల శ్రీవారి ప్రసాదంలో వినియోగించే పలాస జీడిపప్పుకు "జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు - 2025" లభించింది. స్థానిక జీడి రైతుల అకుంఠిత దీక్ష, అధికార యంత్రాంగం కృషి, పటిష్టమైన ప్రణాళికల ఫలితంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ (ఓడిఓపి) కార్యక్రమంలో భాగంగా పలాస జీడిపప్పుకుఈ జాతీయ స్థాయి అవార్డు లభించింది.

అంతర్జాతీయ మార్కెట్ లో పేరున్న పలాస జీడిపప్పు
ఈ నెల 14న ఢిల్లీలో జరగనున్న జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఉద్యాన అధికారి రత్నాల వరప్రసాద్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్నారు. పలాస జీడిపప్పు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా చాలా గుర్తింపు ఉన్న జీడిపప్పు. రుచికి, నాణ్యతకు ఇది పెట్టింది పేరు. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా దీనికి మంచి పేరు ఉంది.

Palasa cashew nuts used in Tirumala prasadam receive rare national recognition

జాతీయ స్థాయి అవార్డుపై మంత్రి అచ్చెన్న హర్షం
అటువంటి పలాస జీడిపప్పు ఇప్పుడు మళ్ళీ జాతీయ స్థాయిలో అవార్డ్ దక్కించుకుంది. ఈ అవార్డ్ కేవలం శ్రీకాకుళం జిల్లాకే కాకుండా, యావత్ ఆంధ్రప్రదేశ్ ఉద్యాన రంగానికి ఒక మైలురాయి అని చెప్పవచ్చు. జిల్లాకు చెందిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులను అభినందించారు.
శ్రీకాకుళం జిల్లాలో జీడి పంట అనేకమందికి ప్రధాన జీవనాధారంగా ఉంది.

శ్రీకాకుళం జిల్లాలో జీడి మామిడి సాగు ఇలా
జిల్లాలో మొత్తం 24,000 హెక్టార్లలో జీడిమామిడి సాగు అవుతోంది. ఇందులో 22,000 హెక్టార్ల తోటలు జీడిపప్పు దిగుబడినిస్తున్నాయి. పలాస, మందస, వజ్రపుకొత్తూరు, సోంపేట వంటి ఉద్దానం మండలాల్లో జీడిమామిడి పంటను బాగా సాగుచేస్తున్నారు. ఈ పంట ద్వారా జిల్లాలో 1,05,000 కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవనం సాగిస్తున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే ఈ పంట రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తోంది.

జీడి మామిడి రైతులకు అండగా ఉద్యావన శాఖ
2018 అక్టోబర్‌లో వచ్చిన తిత్లీ తుఫాను తర్వాత జిల్లా ఉద్యాన పంటలకు తీవ్రనష్టం వాటిల్లిన నేపధ్యంలో ఉద్యానశాఖ విస్తృత పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టింది. సుమారు 23వేల ఎకరాల్లో పాత తోటలను పునరుద్ధరించింది. 7,500ఎకరాల్లో అధిక దిగుబడినిచ్చే కొత్త జీడి తోటలను ఏర్పాటు చేయడం, అలాగే ఉపాధి హామీ పథకం ద్వారా మరో 7,500 ఎకరాల్లో సాగు విస్తరణ చేయడం వంటి చర్యలతో జీడి మామిడి రైతులకు అండగా నిలిచింది.

గతేడాది పలాస జీడిపప్పుపై కేంద్రానికి నివేదిక
మొత్తం రూ.14.60 కోట్లు ఖర్చు చేయగా, రైతులకు సబ్సిడీ, సాంకేతిక సహాయం, శిక్షణ కార్యక్రమాల నిర్వహించి జీడి రైతులకు బాసటగా నిలిచింది. టీటీడీ దేవస్థానానికి కూడా పలాస జీడిపప్పు సరఫరా అవుతుంది. ఎంతో ప్రత్యేకత ఉన్న ఈ పలాస జీడిపప్పు పైన ఉద్యాన శాఖ ద్వారా ఓడిఓపీ ప్రాథమిక నివేదికను చేనేత, జాళి శాఖ సహకారంతో అక్టోబర్ 2024లో కేంద్రానికి సమర్పించారు.

జాతీయ గుర్తింపుతో అందరి నోటా పలాస జీడిపప్పు
ఫిబ్రవరి 2025లో కేంద్రం నుంచి అధికార బృందం పలాస ప్రాంతంలో జీడి తోటలు, ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా పరిశీలించింది. కేంద్ర బృందం ఇచ్చిన నివేదికతో పలాస జీడిపప్పుకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయి అవార్డు ద్వారా పలాస జీడిపప్పు మాత్రమే కాదు, శ్రీకాకుళం జిల్లాకు గుర్తింపు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+