కేబినెట్ మార్పులపై తేల్చేసిన పల్లా-తొలగిస్తే రెండే కారణాలు-టీడీపీ పదవే గొప్ప..!

ఏపీలో త్వరలో కేబినెట్ ప్రక్షాళన ఉండబోతోందన్న వార్తల నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే కూడా అయిన పల్లా శ్రీనివాసరావు ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనకు మంత్రి పదవి దక్కబోతోందన్న వార్తలు ఓవైపు, కేబినెట్లో ఇద్దరికి ఉద్వాసన తప్పదన్న ప్రచారం మరోవైపు కొనసాగుతున్న తరుణంలో పల్లా శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

palla Srinivasa rao interesting comments on cabinet reshuffle says tdp post bigger than minister

రాష్ట్ర సీఎస్ గా బీసీ అయిన విజయానంద్ ను నియమించడంపై సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు వైజాగ్ లో ప్రెస్ మీట్ పెట్టిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ను మీడియా ప్రతినిధులు మంత్రి పదవితో పాటు కేబినెట్ ప్రక్షాళనపై పలు ప్రశ్నలు అడిగారు. వీటికి ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ముందుగా తనకు మంత్రి పదవి దక్కనుందంటూ జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మంత్రి పదవి కంటే గొప్పదన్నారు. అలాగే తన మాట చెల్లడం లేదనే వాదనను ఖండించారు.

మరోవైపు త్వరలో కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని, ఇద్దరు మంత్రులకు ఉద్వాసన ఉంటుందని జరుగుతున్న ప్రచారంపైనా పల్లా శ్రీనివాసరావు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అసమర్థత ఆరోపణలపై తప్ప కూటమి ప్రభుత్వంలో కేబినెట్ నుంచి మంత్రుల్ని తొలగించబోరని పల్లా శ్రీనివాసరావు తేల్చిచెప్పేశారు. కేబినెట్లో అసమర్థత ఆరోపణలపైనే ఇద్దరు జూనియర్ మంత్రుల్ని తప్పించబోతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ పల్లా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే కేబినెట్ ప్రక్షాళన ఉంటుందో లేదో మాత్రం పల్లా స్పష్టం చేయలేదు.

ఏపీలో త్వరలో కేబినెట్ మార్పులు ఉంటాయన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీంతో ఆయన్ను మంత్రిగా కేబినెట్ లోకి తీసుకోనున్నారు. అయితే మరో ఇద్దరు జూనియర్ మంత్రులపై వేటు వేసి వారిలో ఒకరి స్ధానంలో నాగబాబు, మరొకరి స్ధానంలో పల్లాకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం ఉంది. అయితే నాగబాబు విషయంలో మాత్రం మార్చిలోనే ఎమ్మెల్యే ఇచ్చి కేబినెట్లో తీసుకుంటామని నిన్న పవన్ కళ్యాణ ్ క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+