అభినవ దుర్యోధనుడు, అస్తులు టీకి: కెసిఆర్‌పై పల్లె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అభినవ దుర్యోధనుడిగా అభివర్ణించారు. జనాభా లెక్కన ఆంధ్రప్రదేశ్‌కు అప్పులు మిగిలాయని, తెలంగాణకు ఆస్తులు దక్కాయని ఆయన శనివారం మీడియాతో అన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల రుణాలను మాఫీ చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రాష్ట్ర విభజన అశాస్త్రీయమైన రీతిలో జరగడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన విధంగానే ఆంధ్రప్రదేశ్‌కు కూడా 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వినియోగం ఆధారంగా విద్యుత్తును కేటాయించడం అన్యాయమని ఆయన అన్నారు. అవినీతి రహితమైన పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications